AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేసింది మూడు సినిమాలు.. కట్ చేస్తే అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ

పుష్ప 2 తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకున్న అల్లు అర్జున్ మళ్లీ కెమెరా ముందుకు వచ్చేశాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో తన కొత్త సినిమాను పట్టాలెక్కించాడు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె అల్లు అర్జున్ సరసన నటించనుంది.

చేసింది మూడు సినిమాలు.. కట్ చేస్తే అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ
Allu Arjun
Rajeev Rayala
|

Updated on: Oct 29, 2025 | 9:48 AM

Share

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. ఇటీవలే పుష్ప సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్, పుష్ప 1 అలాగే పుష్ప 2 రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు స్టార్ హీరో అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బన్నీ. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గురించి మొన్నామధ్య ఓ అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ముఖ్యంగా సూపర్ హీరోల కాన్సెప్ట్ తో మూవీ ఉంటుందని ఓ వీడియో ద్వారా చెప్పకనే చెప్పారు మేకర్స్. దాంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఒకటే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్స్.. అందరూ తోపులే.. ఈ అందాల భామలు ఈవారంటే

ఈ సినిమా ప్రీప్రొడక్షన్ కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామాగా, భారీ బడ్జెట్‌తో, అత్యధిక విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సన్నివేశాలతో తెరకెక్కనుందని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయనున్నాడని, ఒక పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో నటించలేదు.

సినిమా చూసి పిచ్చోళ్ళు అయిపోయిన జనం.. థియేటర్స్‌లో వాంతులు.. పిల్లలు చూడకూడని ఈ మూవీ ఎక్కడ

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ముగ్గురు నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారని తెలుస్తుంది. వీరిలో ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ కు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. అట్లీ, అల్లు అర్జున్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. మెయిన్ హీరోయిన్‌గా దీపికా పడుకొనే నటిస్తుంది. సీతారామం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది మృణాల్. ఆతర్వాత తెలుగులో హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ అందుకుంది. ఫ్యామిలీ స్టార్ సినిమా నిరాశపరచడంతో కాస్త స్పీడ్ తగ్గించింది. ప్రస్తుతం అడివి శేష్ తో డెకాయిట్ అనే సినిమా చేస్తుంది. అలాగే ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా మృణాల్ నటిస్తుందని తెలుస్తుంది. మృణాల్ తో పాటు జాన్వీ కపూర్ కూడా నటిస్తుందని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆ రోజు తారక్ గంటసేపు ఏడ్చాడు.. మేము ఓదార్చలేకపోయాం.. ఎన్టీఆర్ గురించి రాజేంద్రప్రసాద్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
2026 మకరరాశి వారికి ఎలా ఉండనుందో తెలుసా? కెరీర్, ఆర్థిక పరిస్థితి
2026 మకరరాశి వారికి ఎలా ఉండనుందో తెలుసా? కెరీర్, ఆర్థిక పరిస్థితి
మరో వారంలో అలెన్ స్కాలర్‌షిప్ అడ్మిషన్ టెస్ట్ 2026.. సిద్ధమేనా?
మరో వారంలో అలెన్ స్కాలర్‌షిప్ అడ్మిషన్ టెస్ట్ 2026.. సిద్ధమేనా?