AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లిపీటలెక్కనున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్.. బీఎండబ్ల్యూ కారును కానుకగా ఇచ్చిన నిర్మాత… ధర ఎంతంటే?

మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఇప్పుడు పెళ్లి పీటలెక్కనున్నాడు. ఈ నేపథ్యంలో తన ప్రొడక్షన్ హౌస్ కు మర్చిపోలేని సినిమాను ఇచ్చినందుకు గానూ నిర్మాత నుంచి ఓ ఖరీదైన లగ్జరీ బీఎమ్ డబ్ల్యూ కారు గిఫ్ట్ గా అందుకున్నాడు.

పెళ్లిపీటలెక్కనున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్.. బీఎండబ్ల్యూ కారును కానుకగా ఇచ్చిన నిర్మాత… ధర ఎంతంటే?
Tourist Family Director Abishan Jeevinth
Basha Shek
|

Updated on: Oct 29, 2025 | 9:23 AM

Share

ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాల్లో టూరిస్ట్ ఫ్యామిలీ ఒకటి. సింపుల్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించింది. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ కలెక్షన్లు సాధించింది. కేవలం రూ. 5 కోట్లతో తెరకెక్కిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా రూ. 75 కోట్ల మేర వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ఓటీటీలోనూ రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. పలువరు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపించడం  విశేషం.ఈ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతోనే అభిషన్ జీవింత్‌ అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అంతకు ముందు యూట్యూబర్ గా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అభిషన్మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు. కేవలం డైరెక్టర్ గానే కాదు ఈ సినిమాలో తన యాక్టింగ్ తోనూ ఆకట్టుకున్నాడీ కుర్రాడు. ఇప్పుడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. ఈనెల 31న తన మనసుకు నచ్చిన అమ్మాయితో కలిసి పెళ్లిపీటలెక్కనున్నాడు. ఈ క్రమంలో పెళ్లికి ముందే అభిషన్ కు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మాగేశ్ రాజ్‌.

అభిషన్ వివాహ వేడుకను పురస్కరించుకుని అతనికి ఖరీదైన లగ్జరీ బీఎండబ్ల్యూ కారును పెళ్లి కానుకగా ఇచ్చారు నిర్మాత మాగేశ్ రాజ్‌. ఈ విషయాన్ని ప్రముఖ సినీ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు యంగ్ డైరెక్టర్‌ అభిషన్ కు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా విషయానికి వస్తే.. ఇందులో సీనియర్ నటి సిమ్రాన్, శశి కుమార్, యోగి బాబు వంటి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.