ఊహించని ట్విస్ట్.. అందరూ కలిసి దెబ్బేశారుగా..! పర్మినెంట్ మెంబర్ ఎవరంటే
బిగ్ బాస్ సీజన్ 9.. ఇప్పుడు ఆట రణరంగంగా మారింది. ఇదివరకే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ నుంచి దమ్ము శ్రీజ, భరణి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరిలో ఒకరు మాత్రమే హౌస్ లో ఉంటారని చెప్పాడు బిగ్ బాస్. దీంతో ఇద్దరికి పెట్టిన టాస్కులలో భరణికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు

బిగ్ బాస్ హౌస్ లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ ను పంపిన విషయం తెలిసిందే.. హౌస్ నుంచి అయేషా అనుకోకుండా బయటకు వెళ్లిపోవడంతో ఆమె ప్లేస్ లోకి ఓ ఎక్స్ కంటెస్టెంట్ ను రప్పించనున్నారు. ఈ క్రమంలోనే హౌస్ లోకి భరణి, శ్రీజ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరిలో ఒకరే హౌస్ లో ఉంటారు అంటూ అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే ఇద్దరికీ రెండు టీమ్స్ ఇచ్చి ఆ టీమ్స్ కు టాస్క్ లు ఇచ్చాడు. ఆ టాస్క్ లు ఎవరైతే విన్ అవుతారో వారే హౌస్ లో పర్మినెంట్ గా హౌస్ లో ఉంటారు అంటూ అనౌన్స్ చేశాడు బిగ్ బాస్.దాంతో రకరకాల టాస్క్ లు పెట్టాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో..
ఒకటే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్స్.. అందరూ తోపులే.. ఈ అందాల భామలు ఈవారంటే
ముందుగా మొదటి టాస్క్.. ‘కట్టు-పడగొట్టు’ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. శ్రీజ కోసం డీమాన్-గౌరవ్ ఆడతామని ముందుకు వచ్చారు. అలాగే భరణి కోసం నిఖిల్ ముందుకు వచ్చాడు. అలాగే ఇమ్మానుయేల్ భరణి కూడా ఆడాడు. భరణి.. డీమాన్‌ని ఆపడానికి ట్రై చేశాడు. మరోవైపు నిఖిల్.. గౌరవ్‌ని డిఫెండ్ చేశాడు. పవన్ నిఖిల్ ను, భరణిని ఇద్దరినీ ఉడుంపట్టు పట్టాడు. శ్రీజ తన టవర్ ను పెట్టేసింది.. కానీ బజార్ మోగే చివరి క్షణంలో భరణి టవర్ ను కాలితో తన్ని టవర్ వాక్స్ లో లేకుండా చేశాడు. ఇక విన్నర్ ఎవరో తేల్చుకోవాలి అని బిగ్ బాస్ చెప్పడంతో భరణి గెలిచాడని సుమన్ శెట్టి, లేదు శ్రీజ గెలిచిందని కళ్యాణ్ పెద్ద రచ్చే చేశారు. దాంతో ఇద్దరు సంచలక్ లు విఫలం అయ్యారు అని చెప్పాడు. దాంతో భరణి శ్రీజ ఇద్దరూ కలిసి ఒకరిని సెలక్ట్ చేస్తే వారు ఇద్దరిలో ఎవరో గెలిచారో చెప్పాలి అని బిగ్ బాస్ అనడంతో శ్రీజ ఊహించని విధంగా మాధురి పేరు చెప్పింది.
సినిమా చూసి పిచ్చోళ్ళు అయిపోయిన జనం.. థియేటర్స్‌లో వాంతులు.. పిల్లలు చూడకూడని ఈ మూవీ ఎక్కడ
దాంతో మాధురి షాక్ అయ్యింది.. నాకు వద్దు బాబోయ్ అంటూనే చివరకు శ్రీజ గెలిచింది అని చెప్పింది. ఆతర్వాత రెండో రౌండ్‌లో ఇమ్మానుయేల్ తరఫున రాము బరిలోకి దిగాడు. ఈ రౌండ్ లో పవన్, భరణి పోటీ పడ్డారు. ఒకరిని ఒకరు ఆపే క్రమంలో స్వమింగ్ పూల్ లో పడిపోయారు. దాంతో భరణికి గాయం అయ్యింది. రెండో రౌండ్ లోనూ ఎవ్వరూ గెలవలేదు. భరణికి గాయం అవ్వడంతో ట్రీట్ మెంట్ కోసం భరణి బయటకు వెళ్ళాడు. ఇక ఇప్పుడు భరణి తిరిగి హౌస్ లోకి వచ్చాడని తెలుస్తుంది. ఆతర్వాత జరిగిన టాస్క్ ల్లో భరణి రెండు టాస్క్ లు గెలవగా.. శ్రీజ ఒక టాస్క్ గెలిచిందని తెలుస్తుంది. దాంతో భరణి పర్మినెంట్ మెంబర్ అయ్యిడని తెలుస్తుంది.
ఆ రోజు తారక్ గంటసేపు ఏడ్చాడు.. మేము ఓదార్చలేకపోయాం.. ఎన్టీఆర్ గురించి రాజేంద్రప్రసాద్
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.








