అతనంటే నాకు విపరీతమైన ఇష్టం.. ఛాన్స్ వస్తే వదులుకోనన్న బ్యూటీ
ధన్య బాలకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో ఎన్నో చిత్రాల్లో సహాయ నటిగా కనిపించింది. చాలా కాలంగా తెలుగులో కనిపించలేదు. ఇప్పుడు మరోసారి తెలుగులో సినిమా చేసి మెప్పించనుంది. న్య బాలకృష్ణ నటించిన బాపు సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధన్య బాలకృష్ణ ఎక్కువగా సైడ్ రోల్స్ చేసింది.

పేరుకు సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నటి ధన్య బాలకృష్ణ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సాఫ్ట్‌వేర్ సుధీర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందీ ముందుగుమ్మ. నటన, అందంతో ఆకట్టుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది. వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకెళుతోంది. ఒక వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూనే మరో వైపు ఛాన్స్ దొరికినప్పుడు హీరోయిన్ గా చేసి మెప్పిస్తుంది.
ఒకటే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్స్.. అందరూ తోపులే.. ఈ అందాల భామలు ఈవారంటే
ప్రస్తుతం ఈ అమ్మడు అంత ఆఫర్స్ అందుకోలేకపోతుంది. కోలీవుడ్ ఇండస్ట్రీల్లో ఎన్నో చిత్రాల్లో సహాయ నటిగా కనిపించింది. చాలా కాలంగా తెలుగులో కనిపించలేదు. ఇప్పుడు మరోసారి తెలుగులో సినిమా చేసి మెప్పించనుంది. తెలుగులో సాఫ్ట్ వేరు సుధీర్, నేను శైలజ, రాజు గారి గది, కార్బన్ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అటు వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ పలు వెబ్ సిరీస్ చేస్తూ రాణిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.
సినిమా చూసి పిచ్చోళ్ళు అయిపోయిన జనం.. థియేటర్స్‌లో వాంతులు.. పిల్లలు చూడకూడని ఈ మూవీ ఎక్కడ
గతంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పిందీ బ్యూటీ. ఆ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ధన్య మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్, సూర్య, రణ్‌బీర్ కపూర్ తన క్రష్‌లని.. ఛాన్స్ దొరికితే వారితో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. ఇక ఓ సినిమాలో మద్యం తాగిన సన్నివేశం గురించి అభిమాని ప్రశ్నించగా.. కేవలం మందు తాగినట్లు చూపించారు. కానీ అది నిజం కాదు. నేను తాగింది కేవలం నీళ్లు మాత్రమేనని చెప్పుకొచ్చింది. ఇక ఈ చిన్నది కేవలం క్యారక్టర్ ఆర్టిస్ట్‌లకే పరిమితం కాకుండా.. హీరోయిన్‌గానూ పలు చిత్రాల్లో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ధన్య రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను కవ్విస్తుంది.
ఆ రోజు తారక్ గంటసేపు ఏడ్చాడు.. మేము ఓదార్చలేకపోయాం.. ఎన్టీఆర్ గురించి రాజేంద్రప్రసాద్
View this post on Instagram
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.








