AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు మహేష్ బాబు, ఇప్పుడు రవితేజ సినిమాలో.. యంగ్ హీరోకు గోల్డెన్ ఛాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మహేష్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

అప్పుడు మహేష్ బాబు, ఇప్పుడు రవితేజ సినిమాలో.. యంగ్ హీరోకు గోల్డెన్ ఛాన్స్
Maheshbabu,raviteja
Rajeev Rayala
|

Updated on: Oct 30, 2025 | 1:17 PM

Share

మాస్ మహారాజ రవితేజ వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు రవితేజ. అయినా కూడా హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇక ఇప్పుడు మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా రేపు (అక్టోబర్ 31న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. పలు సినిమాలకు రైటర్ గా పని చేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నాడు. ఇక ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో శ్రీలీల, రవితేజ కలిసి ధమాకా సినిమా చేసిన విషయం తెలిసిందే.. ఈ సినిమా పై రవితేజ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

ఒకటే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్స్.. అందరూ తోపులే.. ఈ అందాల భామలు ఈవారంటే

ఇక ఈ సినిమా తర్వాత రవితేజ ఓ యంగ్ హీరోతో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడని తెలుస్తుంది. యంగ్ హీరో ఎవరో కాదు నవీన్ పోలిశెట్టి. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన నవీన్.. ఆతర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత జాతిరత్నాలు అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత స్టార్ హీరోయిన్ అనుష్కతో కలిసి మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా చేశారు. ఈ మూవీ కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

సినిమా చూసి పిచ్చోళ్ళు అయిపోయిన జనం.. థియేటర్స్‌లో వాంతులు.. పిల్లలు చూడకూడని ఈ మూవీ ఎక్కడ

ఇక ఆ సినిమా తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న నవీన్.. ఇప్పుడు అనగనగ ఓ రాజు అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కాగా ఈ సినిమా తర్వాత రవితేజతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఓ కామెడీ ఎంటర్టైనర్ లో నవీన్, రవితేజ కలిసి నటిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. గతంలో మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాలో నవీన్ చిన్న పాత్రలో కనిపించాడు. అతను చేసింది చిన్న పాత్రే అయినా సినిమాలో కీలకంగా ఉంటుంది అతని పాత్ర. ఇక ఇప్పుడు రవితేజతో కలిసి నటించనున్నాడు నవీవ్ పోలిశెట్టి. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

ఆ రోజు తారక్ గంటసేపు ఏడ్చాడు.. మేము ఓదార్చలేకపోయాం.. ఎన్టీఆర్ గురించి రాజేంద్రప్రసాద్

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.