AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahakali: హనుమాన్ డైరెక్టర్ కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఆయన.. తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ముందుగా హనుమాన్ సినిమాను తెరకెక్కించారు. గతేడాది సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ వసూళ్లు సునామీ సృష్టించింది. ఇందులో తేజ సజ్జా హీరోగా నటించారు.

Mahakali: హనుమాన్ డైరెక్టర్ కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 30, 2025 | 12:50 PM

Share

ప్రశాంత్ వర్మ.. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తుంది. ఈ యంగ్ డైరెక్టర్ తెరకెక్కించే సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ప్రశాంత్ వర్మ. డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలు తెరకెక్కిస్తూ హిట్స్ అందుకుంటున్నాడు ఈ కుర్రదర్శకుడు. అ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా కల్కి అనే సినిమా తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాగే 2021లో వచ్చిన జాంబీ రెడ్డి సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన తేజ హీరోగా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక తమన్నా ప్రధాన పాత్రలో దట్ ఈజ్ మహాలక్ష్మీ అనే సినిమా చేశాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

ఒకటే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్స్.. అందరూ తోపులే.. ఈ అందాల భామలు ఈవారంటే

ఇక ఈ ఏడాది హనుమాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలను లేకుండా వచ్చిన హనుమాన్ సినిమా ఏకంగా మూడు వందల కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో తేజ సజ్జ కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. హనుమంతుడి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి

సినిమా చూసి పిచ్చోళ్ళు అయిపోయిన జనం.. థియేటర్స్‌లో వాంతులు.. పిల్లలు చూడకూడని ఈ మూవీ ఎక్కడ

తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం మహా కాళీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో కాళీ మాత గెటప్ లో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? హనుమాన్ యూనివర్ పేరుతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మహాకాళి అనే సినిమాను చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ.. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా భూమీ శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ అమ్మడు తెలుగులో పలు సీరియల్స్ లో నటించింది. అలాగే షరతులు వర్తిస్తాయి అనే సినిమా చేసింది. మొనీమధ్య వచ్చిన కింగ్ డమ్ సినిమాలోనూ నటించింది భూమీ. ఇక ఇప్పుడు మహాకాళీ సినిమాలో మెయిన్ రోల్ లో నటించనుంది. ఇక ఈ సినిమా షూటింగ్ 50శాతం పూర్తయ్యిందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఆ రోజు తారక్ గంటసేపు ఏడ్చాడు.. మేము ఓదార్చలేకపోయాం.. ఎన్టీఆర్ గురించి రాజేంద్రప్రసాద్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.