Andhra: ఆయ్.! మాది భీమవరం అండీ.. ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఈ మాత్రం ఉండాల్సిందే
ఆయ్.! మాది భీమవరం అండీ.! అందులోనూ ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉండాలి మరి. బాహుబలి రీ-రిలీజ్ కు భీమవరం రెబల్ స్టార్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అదేంటో ఈ వార్తలో చూసేద్దాం. మరి ఆ వివరాలు ఇలా..

బాహుబలి మళ్ళీ రిలీజ్ కావడంతో భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ప్రభాస్ సొంత ప్రాంతం కావడంతో ఆ జోరు మామూలుగా లేదు. బాణాసంచా కాలుస్తూ, డిజే సౌండ్స్‌లో ప్రభాస్ పాటలకు డాన్సులు వేస్తూ, భారీ కేకును కట్ చేసి ప్రభాస్ సినిమాను చూసారు అభిమానులు. బాహుబలి మళ్ళీ రిలీజ్ అయ్యింది. సినీ జగత్తులో చరిత్ర సృష్టించిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు కలిపి బాహుబలి – ది ఎఫిక్ సినిమాగా రిలీజ్ చేసారు నిర్మాతలు. బాహుబలి చిత్రాన్ని రాజమౌళి నిర్మించి పది సంవత్సరాలు కావడంతో మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. రెండు సినిమాలు కలిపి ఒకే సినిమాగా రిలీజ్ కావడం ప్రభాస్ అభిమానులకు ఉత్సాహాన్ని ఇచ్చింది.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బాహుబలి – ది ఎఫిక్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ అభిమానులు సందడి చేసారు. ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు ఉండి వాసు ఆధ్వర్యంలో 51 కేజీల కేక్ కట్ చేసారు అభిమానులు. సినిమా ధియోటర్ వద్ద బాణాసంచా కాల్చి పండుగ చేసుకున్నారు. బాహుబలి వన్, బాహుబలి 2 రెండు సినిమాలు కలిపి ది ఎపిక్ బాహుబలిగా సినిమా రావడం ఆనందంగా ఉందని అన్నారు. బాహుబలి రిలీజ్ అయినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నామో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉన్నామని ఈ సినిమాను అందరూ చూడాలని అన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు ఉండి వాసు. డీజే సౌండ్స్‌తో డాన్స్‌లు చేస్తూ రీ రిలీజ్‌ను ఎంజాయ్ చేసారు ప్రభాస్ అభిమానులు. భారీగా థియేటర్స్ దగ్గరకు చేరుకున్న ప్రభాస్ అభిమానులు సినిమాను చూసి ఆనందించారు.




