Naveen Polishetty: మరో ప్రాజెక్ట్‏కు నవీన్ పోలిశెట్టి గ్రీన్ సిగ్నల్, డైరెక్టర్ ఎవరంటే..

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు అందుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఇక ఇటీవల వచ్చిన

Naveen Polishetty: మరో ప్రాజెక్ట్‏కు నవీన్ పోలిశెట్టి గ్రీన్ సిగ్నల్, డైరెక్టర్ ఎవరంటే..
Naveen
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 20, 2021 | 7:23 AM

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు అందుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఇక ఇటీవల వచ్చిన జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు నవీన్, ఈ మూవీలో నవీన్ తన నటనతో ప్రేక్షకులతోపాటు.. దర్శక నిర్మాతలను సైతం ఆకట్టుకున్నాడు. దీంతో ఈ జాతి రత్నంతో సినిమా తెరకెక్కించేందుకు పోటీ పడ్డారు. ఇక ఈ సినిమా విడుదలైన నెలలు గడుస్తున్న నవీన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ రాలేదు. గత కొద్ది రోజులుగా హీరోయిన్ అనుష్క, నవీన్ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లుగా టాక్ నడిచింది. అయితే ఆ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో మధ్యలోనే ప్రాజెక్ట్‏కు బ్రేక్ పడిందని.. అనుష్క ఈ మూవీ చేసేందుకు నో చెప్పిందని ఫిల్మ్ సర్కిల్లో గాసిప్స్ వినిపించాయి. ఇక ఇప్పటివరకు నవీన్ చేయబోతున్న సినిమాలపై ఎలాంటి క్లారిటీ రాలేదు. జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నవీన్.. తన తదుపరి చిత్రాలను ఎంచుకోవడంలో అచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా నవీన్ పోలిశెట్టి తదపరి సినిమా గురించి ఓ క్రేజీ గాసిప్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ జాతి రత్నం నూతన దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లుగా టాక్. జాతిరత్నాలు సినిమా రైటింగ్ డిపార్ట్‏మెంట్‏లో కీలకంగా పనిచేసిన కళ్యాణ్ అనే కొత్త దర్శకుడి స్టోరీకి నవీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. సితార ఎంటర్‏టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లుగా టాక్. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట.

Also Read: Balakrishna: విలన్ పాత్రకోసం విలక్షణ నటుడు.. బాలయ్య కోసం బరిలోకి తమిళ్ హీరో

Sai Dharam Tej – Vaishnav Tej: మెగా బ్రదర్స్ మధ్య బాక్సాఫీస్ వార్.. వారం గ్యాప్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలు..

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్.. మీకోసం క్లూ.. మన తెలుగమ్మాయే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్