బంపర్‌ ఆఫర్ కొట్టేసిన బబ్లీ బ్యూటీ.. ధనుష్‌ సరసన హీరోయిన్‌గా అవకాశం.. ఎవరో తెలుసా..?

బంపర్‌ ఆఫర్ కొట్టేసిన బబ్లీ బ్యూటీ.. ధనుష్‌ సరసన హీరోయిన్‌గా అవకాశం.. ఎవరో తెలుసా..?
Raashi Khanna

Rashi Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ముద్దుగుమ్మ రాశిఖన్నా. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో అందరిని

uppula Raju

| Edited By: Ravi Kiran

Aug 20, 2021 | 6:33 AM

Rashi Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ముద్దుగుమ్మ రాశిఖన్నా. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో అందరిని ఆకట్టుకుంది. ఊహలు గుసగుసలాడే సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో రాశీఖన్నాకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించింది ఈ వయ్యారి. జిల్, బెంగాల్ టైగర్, జైలవకుశ, రీసెంట్ గా వచ్చిన ప్రతిరోజు పండగే వంటి సినిమాలతో మంచి గుర్తిపు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడికి తాజాగా అదిరిపోయే ఆఫర్ వచ్చింది. సౌత్‌ సూపర్‌ స్టార్ ధనుష్ సినిమాలో హీరోయిన్‌గా చేసే అవకాశం దక్కింది.

గతంలో హాట్ హాట్‌ ఫోటోలతో ఇన్‌స్టాగ్రామ్‌ని షేక్‌ చేసిన రాశి ఖన్నా ప్రస్తుతం అజయ్ దేవగన్‌తో రుద్ర సినిమా చేస్తోంది. రెండో షెడ్యూల్‌లో బిజీగా మారింది. ఇందులో ఆమెతో పాటు అజయ్ దేవగన్, అతుల్ కులకర్ణి నటిస్తున్నారు. ఆ తర్వాత ఆమె ధనుష్‌ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం పేరు ఇంకా ఖరారు కాలేదు కానీ ఈ సినిమాకి మిథిరన్ జవహర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణ చిత్రం నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కోసం త్వరలో ఆమె చెన్నై వెళ్లనుంది.

రాశి త్వరలో తుగ్లక్ దర్బార్, అరణ్మనై 3, భ్రమ్ చిత్రాల ప్రమోషన్లను ప్రారంభిస్తుంది. ఈ సందర్భంగా ఓ ఛానెల్‌ కిచ్చిన ఇంటర్వూలో రాశి ఈ విధంగా మాట్లాడింది. “నా కెరీర్‌లో ఇంత వరకు చేరుకోవడానికి చాలా కష్టపడ్డాను. దీని ఫలితంగా ఉత్తర, దక్షిణ వినోద పరిశ్రమలో ప్రేక్షకులకు చేరువయ్యాను. ప్రతి మూడు-నాలుగు రోజులకు వివిధ నగరాలకు ప్రయాణం చేయడం అంటే అంత సులభం కాదు కానీ నేను ఆశాజనకమైన వ్యక్తులతో పని చేయాలనుకుంటున్నాను నా కళ పట్ల నా అభిరుచిని కొనసాగించాలనుకుంటున్నానని” తెలిపింది.

Crime News: సంబరాల కోసం అంబులెన్స్‌లను వాడుకున్న యువకులు.. డ్రైవర్లతో సహా నలుగురిపై కేసు నమోదు

పదో తరగతి పాస్‌ కాలేదు కానీ ముఖ్యమంత్రిగా పని చేశాడు..! 86 ఏళ్ల వయసులో ఇంగ్లీష్ పరీక్ష రాస్తున్నాడు..

Viral Photos: కుక్కల పెళ్లికి మనుషుల హడావిడి..! BMW కారు.. కమ్మని విందు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu