Crime News: సంబరాల కోసం అంబులెన్స్‌లను వాడుకున్న యువకులు.. డ్రైవర్లతో సహా నలుగురిపై కేసు నమోదు

Crime News: హెల్త్‌ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎవరికైనా ముందుగా గుర్తుకువచ్చేది అంబులెన్స్. వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేసి పరిస్థితి గురించి వివరిస్తాం.

Crime News: సంబరాల కోసం అంబులెన్స్‌లను వాడుకున్న యువకులు.. డ్రైవర్లతో సహా నలుగురిపై కేసు నమోదు
Ambulance
Follow us

|

Updated on: Aug 20, 2021 | 12:02 AM

Crime News: హెల్త్‌ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎవరికైనా ముందుగా గుర్తుకువచ్చేది అంబులెన్స్. వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేసి పరిస్థితి గురించి వివరిస్తాం. రోగిని ఆస్పత్రికి చేర్చడంలో అంబులెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం కూడా అంబులెన్స్‌లకు కొన్ని వెసులుబాటు కల్పించింది. రోడ్డుపై అంబులెన్స్‌లకు వెంటనే దారివ్వాలని నిబంధణ కూడా ఉంది. లేదంటే ఎంతటి వారైనా కేసు నమోదు చేస్తారు. సిగ్నల్స్‌ పాయింట్‌ దగ్గర కూడా అంబులెన్స్‌కు దారిస్తారు. అలాంటిది కొంతమంది ఆకతాయి యువకులు సంబరాల కోసం అంబులెన్స్‌లను వాడుకున్నారు. చెన్నైలో జరిగిన ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

తిరునల్వేలి జిల్లా మేలప్పలయంలో కొంతమంది యువకులు క్రికెట్‌లో గెలిచిన సందర్భంగా అంబులెన్స్‌ వాహనాల్లో ఊరేగారు. స్ధానికంగా ఏర్పాటు చేసినా క్రికెట్ టోర్నమెంటులో విజయం సాధించిన సందర్భంగా ఐదు అంబులెన్స్‌ వాహానాల్లో గెలిచిన ట్రోఫిని పెట్టి హంగమా చేశారు. రోగుల కోసం వినియోగించే వాహనాన్ని ఇలా వాడటం పై నెటిజెన్ల పైర్ అవుతున్నారు. సంబరాలు చేసుకోవడానికి మీకు వాహనాలే దొరకలేదా అంటూ మండిపడుతున్నారు. రకరకాల కామెంట్స్‌తో ట్రోల్‌ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారడంతో ఐదు అంబులెన్స్‌ డ్రైవర్లు సహా నలుగురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలుగు జవాన్లకు స్వగ్రామంలో అభినందనల వెల్లువ.. 62 మందికి పైగా భారతీయులను ఇండియాకు చేర్చడంలో కీలకపాత్ర

Viral Video: ఆ ఇంట్లో సంకెళ్ల దెయ్యం.. తనని విడిపించమంటూ ఆర్తనాదాలు..!! వీడియో

Minister Avanthi Srinivas: సోషల్ మీడియాలో మంత్రి పేరిట వైరల్ అవుతోన్న రాసలీలల ఆడియో.. అవంతి క్లారిఫికేషన్

R Narayana Murthy: ప్రజల్ని చైతన్య వంతుల్ని చేయడంలో సినిమాల పాత్ర కీలకం.. చట్టాలపై నటుడు ఆర్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు