పదో తరగతి పాస్‌ కాలేదు కానీ ముఖ్యమంత్రిగా పని చేశాడు..! 86 ఏళ్ల వయసులో ఇంగ్లీష్ పరీక్ష రాస్తున్నాడు..

పదో తరగతి పాస్‌ కాలేదు కానీ ముఖ్యమంత్రిగా పని చేశాడు..! 86 ఏళ్ల వయసులో ఇంగ్లీష్ పరీక్ష రాస్తున్నాడు..
Om Prakash Chautala

Om Prakash Chautala: ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది కానీ ఇప్పటి వరకు పదోతరగతి పరీక్ష మాత్రం పాస్ కాలేదు. వినడానికి విడ్డూరంగా ఉన్నా

uppula Raju

|

Aug 20, 2021 | 12:34 AM

Om Prakash Chautala: ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది కానీ ఇప్పటి వరకు పదోతరగతి పరీక్ష మాత్రం పాస్ కాలేదు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది మాత్రం నిజం. అందుకే కాబోలు 86 ఏళ్లు వచ్చినా పట్టువదలని విక్రమార్కుడులా ఇంకా పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షకు హాజరవుతున్నాడు. అతడు ఎవరో కాదు హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా. 2013 జేబీటీ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో కోర్టు ఆయనకి 10ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది ఆరంభంలో హరియాణా ఓపెన్ బోర్డు కింద చౌతాలా 12వ తరగతి పరీక్షలు రాశారు. అయితే ఆయన 10వ తరగతి ఇంగ్లీషులో పాస్ మార్కును సాధించలేకపోయారు. అది పాస్‌ అయ్యే వరకు 12వ తరగతి ఫలితాలను బోర్డు నిలిపివేసింది. దానికోసమే ఆయన ఇంగ్లీషు పరీక్షను రాయాల్సి వచ్చింది. కాగా అనారోగ్యం కారణంగా పరీక్ష రాసేందుకు సహాయకుడి కోసం ఆయన అభ్యర్థన పెట్టుకున్నారు. బోర్డు నుంచి అనుమతి వచ్చిన అనంతరం ఆయన పరీక్షను పూర్తి చేశారు. అయితే ఆయన పరీక్షా కేంద్రానికి వచ్చిన క్రమంలో మీడియా ఆయనతో మాట్లేందుకు ప్రయత్నించగా..‘ నేను విద్యార్థిని. నో కామెంట్స్‌’ అని వ్యాఖ్యానించడం విశేషం.

ఆయన సిర్సాలోని ఆర్య కన్య సీనియర్‌ సెకండరీ స్కూల్‌ పరీక్ష కేంద్రంలో ఇంగ్లీష్ పరీక్ష రాశారు. 2017లో తన 82 ఏండ్ల వయస్సులో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూల్‌లో 10వ తరగతి పరీక్ష రాసి 53.4 శాతం మార్కులు సాధించారాయన.

Crime News: సంబరాల కోసం అంబులెన్స్‌లను వాడుకున్న యువకులు.. డ్రైవర్లతో సహా నలుగురిపై కేసు నమోదు

Minister Avanthi Srinivas: సోషల్ మీడియాలో మంత్రి పేరిట వైరల్ అవుతోన్న రాసలీలల ఆడియో.. అవంతి క్లారిఫికేషన్

తెలుగు జవాన్లకు స్వగ్రామంలో అభినందనల వెల్లువ.. 62 మందికి పైగా భారతీయులను ఇండియాకు చేర్చడంలో కీలకపాత్ర

R Narayana Murthy: ప్రజల్ని చైతన్య వంతుల్ని చేయడంలో సినిమాల పాత్ర కీలకం.. చట్టాలపై నటుడు ఆర్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu