AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: విలన్ పాత్రకోసం విలక్షణ నటుడు.. బాలయ్య కోసం బరిలోకి తమిళ్ హీరో

నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలో అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

Balakrishna: విలన్ పాత్రకోసం విలక్షణ నటుడు.. బాలయ్య కోసం బరిలోకి తమిళ్ హీరో
Balakrishna
Rajeev Rayala
|

Updated on: Aug 19, 2021 | 4:58 PM

Share

Nandamuri Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలో అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మరోసారి బాలకృష్ణను పవర్ ఫుల్ పాత్రలో చూపించనున్నాడు బోయపాటి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు బాలయ్య. అఖండ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఈ నట సింహం. ఇప్పటికే బాలయ్యకు కథను కూడా వినిపించాడు గోపీచంద్. ఈ సినిమాలో బాలకృష్ణ ఫ్యాక్షనిస్ట్‌గా కనిపించనున్నాడని టాక్. అఖండ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే… ఈ సినిమాను మొదలు పెట్టనున్నాడు బాలకృష్ణ. ఇటీవలే గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు అదిరిపొయ్యే హిట్ ఇచ్చాడు గోపీచంద్. దాంతో ఇప్పుడు బాలకృష్ణ కోసం ఎలాంటి కథ సిద్ధం చేశారన్నదానిపై అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్‌‌గా ఓ స్టార్ హీరోను ఎంపిక చేశారని తెలుస్తుంది.

బాలయ్యను ఢీ కొట్టే విలన్‌గా తమిళ నటుడు విజయ్ సేతుపతి కనిపించనున్నాడని తెలుస్తుంది. తన విలక్షణ నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న విజయ్ సేతుపతి ఇటీవల విలన్‌గాను మెప్పిస్తున్నారు. దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో విలన్‌గా నటించి మెప్పించాడు సేతుపతి. అలాగే తెలుగులో ఉప్పెన సినిమాతో ఆకట్టుకున్నాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రిగా నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు బాలయ్య సినిమాలో మరోసారి విలనిజం చూపించనున్నారని టాక్ వినిపిస్తుంది. విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ ఈ సినిమాకు మరింత హెల్ప్ అవుతుందని గోపీచంద్ మలినేని భవిస్తున్నారట.

1

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shilpa Shetty: ఇంకా జైల్లోనే భర్త రాజ్ కుంద్రా.. కెమెరా ముందుకొచ్చిన శిల్పా శెట్టి

Mushroom Benefits: పుట్టగొడుగులతో మొటిమలకు చెక్.. ముఖం మరింత అందంగా కనిపించాలంటే మష్రూమ్స్ ఇలా వాడాల్సిందే..

TGWDCW Recruitment: తెలంగాణలో పది ఉత్తీర్ణులైన మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Follow Us
జ్యూస్ కన్నా పండ్లు తినడం ఎందుకు మంచిది? ఫలాల ఆరోగ్య లాభాలు..
జ్యూస్ కన్నా పండ్లు తినడం ఎందుకు మంచిది? ఫలాల ఆరోగ్య లాభాలు..
అబ్బ సాయిరాం.. తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణశాఖ
అబ్బ సాయిరాం.. తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణశాఖ
గుడ్ న్యూస్.. గ్యాస్ ధరలను భారీగా తగ్గించిన ఆదానీ గ్రూప్..
గుడ్ న్యూస్.. గ్యాస్ ధరలను భారీగా తగ్గించిన ఆదానీ గ్రూప్..
సీబీఎస్సీ 12వ తరగతి 2026 అన్ని పరీక్షలు రద్దు! కారణం ఇదే..
సీబీఎస్సీ 12వ తరగతి 2026 అన్ని పరీక్షలు రద్దు! కారణం ఇదే..
LPG సిలిండర్లను ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారా? జైలు శిక్ష తప్పదు!
LPG సిలిండర్లను ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారా? జైలు శిక్ష తప్పదు!
బంగారం కొనేవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ నిర్ణయంతో..
బంగారం కొనేవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ నిర్ణయంతో..
ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు..
ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు..
చేతులెలా వచ్చాయ్‌ రా.. కట్టుకున్న భార్య గొంతుకోసి పారిపోయిన భర్త
చేతులెలా వచ్చాయ్‌ రా.. కట్టుకున్న భార్య గొంతుకోసి పారిపోయిన భర్త
కాశీ ఎందుకు అంత పవిత్రం? అక్కడ మరణానికి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
కాశీ ఎందుకు అంత పవిత్రం? అక్కడ మరణానికి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
తెలంగాణ పాలిసెట్‌ 2026కు ఆన్‌లైన్ దరఖాస్తులు.. ముఖ్య సూచనలు ఇవే
తెలంగాణ పాలిసెట్‌ 2026కు ఆన్‌లైన్ దరఖాస్తులు.. ముఖ్య సూచనలు ఇవే