AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGWDCW Recruitment: తెలంగాణలో పది ఉత్తీర్ణులైన మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

TGWDCW Recruitment 2021:పదవ తరగతి పాసైన నిరుద్యోగ మహిళలు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పలు జిల్లాలో అంగన్ వాడీ కేంద్రానికి పలు పోస్టుల..

TGWDCW Recruitment: తెలంగాణలో పది ఉత్తీర్ణులైన మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్
Ts Anganwadi
Surya Kala
|

Updated on: Aug 19, 2021 | 1:04 PM

Share

TGWDCW Recruitment 2021:పదవ తరగతి పాసైన నిరుద్యోగ మహిళలు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పలు జిల్లాలో అంగన్ వాడీ కేంద్రానికి పలు పోస్టుల భర్తీ కోసం మహిళా, సంక్షేమ అధికారి కార్యాలయం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు పోస్టులను భర్తీ చేయనుంది. భారీ సంఖ్యంలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హులు, ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలను వెబ్ సైట్ https://mis.tgwdcw.in/ కు వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా ఆగస్ట్ 25 తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు..

జిల్లా వారీగా పోస్టుల ఖాళీల వివరాలు:

సంగారెడ్డి అంగన్ వాడీ టీచర్ -17, హెల్పర్ -90 యాదాద్రి భువనగిరి టీచర్ -08, హెల్పర్ -45, మినీ అంగన్ వాడీ టీచర్ -04

నల్గొండ అంగన్ వాడీ టీచర్-23, AWMT-09, హెల్పర్-79 సూర్యాపేట అంగన్ వాడీ టీచర్ -23, హెల్పర్ -85

ఇప్పటికే తెలంగాణ లోని అంగన్‌వాడీ ఆన్‌లైన్ ఫారం: 01-08-2021 నుంచి దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే యాదాద్రి భువనగిరి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 25-08-2021.. ఇక సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాల్లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 27-08-2021. నల్గొండ లోని పత్రాల ధృవీకరణ తేదీలు 20-08-2021 నుండి 30-08-2021

Also Read:   ఆ దేశంలోని ఫైళ్లలో సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ .. 100 ఏళ్ల వరకు చెప్పరట ఎందుకంటే