Samsung Dost: భారత యువతకు అండగా శాంసంగ్ దోస్త్.. 50,000 మందికి ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా..
Samsung Dost: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ యువతలో ఉద్యోగాన్ని అవసరమయ్యే నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో 'శాంసంగ్ దోస్త్' అనే...
Samsung Dost: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ యువతలో ఉద్యోగాన్ని అవసరమయ్యే నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ‘శాంసంగ్ దోస్త్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శాసంగ్ ఇండియా ఈ సరికొత్త కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. శాంసంగ్ దోస్త్ (డిజిటల్ అండ్ ఆఫ్‌లైన్ స్కిల్స్ ట్రైనింగ్) కార్యక్రమంతో దేశంలో సుమారు 50 వేల మంది యువతకు ఉద్యోగానికి అవసరమయ్యే నైపుణ్యాలను నేర్పిస్తారు. ఎలక్ట్రానిక్స్ రిటైల్ సెక్టర్‌లో రానున్న రోజుల్లో ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శాంసంగ్ ఈ కార్యక్రమాన్ని నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ) సహకారంతో నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్‌ఎస్‌డీసీకి ఉన్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో యువతకు స్కిల్స్ నేర్పించనున్నారు.
యువత ఉద్యోగాలను సాధించుకునే విధంగా వారిలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి శాంసంగర్ ఎన్‌ఎస్‌డీసీతో ఎమ్‌ఓయూ కుదుర్చుకుంది. ఈ ‘దోస్త్’ కార్యక్రమం ద్వారా 200 గంటల క్లాస్‌రూమ్‌తో పాటు ఆన్‌లైన్ శిక్షణ అందించనున్నారు. ఐదు నెలల శిక్షణ అనంతరం ఉద్యోగ శిక్షణలో భాగంగా.. శాంసంగ్ రిటైల్ స్టోర్‌లలో స్టైఫండ్ కూడిన ఉద్యోగం అందిస్తారు. దీనిద్వారా భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఎలక్ట్రానిక్స్ రిటైల్ రంగానికి అవసరమైన నైపుణ్యాలను యువత సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే సౌత్ కొరియాకు చెందిన శాంసంగ్ గడిచిన 25 ఏళ్లుగా భారత్‌కు వ్యాపార భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. గృహపకరణాలు, స్మార్ట్‌ఫోన్‌ల తయారీ, రీసెర్చ్‌లో శాంసంగ్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. శాంసంగ్ ప్రపంచంలోనే అతి పెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ ఫ్యాక్టరీని భారత్‌లోని నోయిడాలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ద్వారా తయారీ, రిటైల్ రంగంలో భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు దక్కాయి.
Also Read: Alert: వాట్సాప్‌లో తెలిసినవారి నుంచి వచ్చిన లింక్స్ క్లిక్ చేసినా అంతా ఖల్లాస్.. తస్మాత్ జాగ్రత్త
Vijayawada: రాహుల్ మిస్టరీ డెత్ కేసులో కొత్త ట్విస్ట్.. కారులో కీలక ఆధారాలు లభ్యం.. డ్రైవర్ సీట్‌లో