Alert: వాట్సాప్‌లో తెలిసినవారి నుంచి వచ్చిన లింక్స్ క్లిక్ చేసినా అంతా ఖల్లాస్.. తస్మాత్ జాగ్రత్త

సైబర్‌ కేటుగాళ్లు రోజుకో కొత్త ఐడియాతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అక్రమ మార్గాల ద్వారా అమాయకుల జేబులు గుళ్ల చేస్తున్నారు. తాజాగా వాట్సాప్‌ను..

Alert: వాట్సాప్‌లో తెలిసినవారి నుంచి వచ్చిన లింక్స్ క్లిక్ చేసినా అంతా ఖల్లాస్.. తస్మాత్ జాగ్రత్త
Whats App Hacking
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 19, 2021 | 4:54 PM

సైబర్‌ కేటుగాళ్లు రోజుకో కొత్త ఐడియాతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అక్రమ మార్గాల ద్వారా అమాయకుల జేబులు గుళ్ల చేస్తున్నారు. తాజాగా వాట్సాప్‌ను సైబర్ చీటింగ్‌కు అస్త్రంగా మలుచుకున్నారు. ఓ అమాయకుడి నంబర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకుని.. వెంటనే సెక్యూరిటీ సెట్టింగ్స్ మార్చేసి టూ స్టెప్ వెరిఫికేషన్ చేసి.. దాని ఆధారంగా అతడి కాంటాక్ట్స్‌ లిస్ట్‌ను సంగ్రహిస్తున్నారు. ఆ అమాయక వ్యక్తి ఈ విషయం గుర్తించి తన ఫోన్‌లో వాట్సాప్‌ను మరోసారి యాక్టివేట్‌ చేసుకోవాలని భావించినా.. అది సాధ్యం కాదు.  ఈ క్రమంలో సైబర్ నేరస్థులు ఆ వ్యాట్సాప్ లిస్ట్‌లో ఉన్నవారికి మాల్‌వేర్ లింకు పంపి హ్యాక్‌ చేస్తున్నారు. ఆ లింక్ క్లిక్ చేయగానే వారి నంబర్లు కూడా హ్యాకింగ్‌కు గురవుతాయి. వారికి సందేశాలు పంపుతూ ఆపదలో ఉన్నామని చెబుతూ దండుకుంటున్నారు. తెలిసిన వారి నంబర్.. అందునా వ్యాట్సాప్ అందుకే మనీ సెండ్ చేసి చాలామంది మోసపోతున్నారు.  అందుకే తెలిసినవారి నంబర్ల నుంచి లింకులు వచ్చినా సరే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నగరంలో గడిచిన మూడ్రోజుల్లో నలుగురు బాధితులుగా మారినట్లు పోలీసులు చెబుతున్నారు. రూ.4 లక్షలు కోల్పోయిన వీళ్లు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మూడు కేసులు నమోదు చేసినట్లు సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.

సైబర్ నేరగాళ్లు ఇలా మోసం చేస్తున్నారు….

ఎవరైనా ఒక స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ను వాడుతూ… మరో ఫోన్‌లోకి మారితే.. ఓటీపీని పొంది ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. దీన్ని తమకు అనువుగా మార్చుకుంటున్న చీటర్స్… కొన్ని నంబర్లతో వాట్సాప్‌ యాక్టివ్‌ చేయడానికి ట్రై చేస్తున్నారు.  దీనికి సంబంధించిన ఓటీపీ అసలు మొబైల్ ఓనర్‌కు వెళ్తుంది. రకరకాల పేర్లతో వారికి ఫోన్ చేసి కేటుగాళ్లు సదరు ఓటీపీలు సంపాదిస్తున్నారు. ఉదాహారణకు ఓ లావాదేవీలో పొరపాటున మీ ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేశానని, దీంతో ఓటీపీ మీకు వచ్చిందని చెప్పి సైబర్‌ నేరగాళ్లు వారి నుంచి తీసుకుంటున్నారు.   ఇలా ఓటీపీని పొందగానే తమ ఫోన్లలో వారి నంబర్‌తో వాట్సాప్‌ యాక్టివేట్‌ చేసుకుంటున్నారు. ఆ వెంటనే వారి వాట్సాప్‌ డీపీని కాపీ చేసి తమ దానికి పెట్టేస్తున్నారు. దీంతో పాటు సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను ఛేంజ్ చేసి టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ చేస్తున్నారు. ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది నంబర్లు సైబర్‌ నేరగాళ్లు తమ అధీనంలోకి తీసుకుని.. మోసాలకు పాల్పడుతున్నారు.

Also Read: కోవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు జగన్ సర్కార్ ఆపన్న హస్తం.. కీలక ఆదేశాలు

Vijayawada: రాహుల్ మిస్టరీ డెత్ కేసులో కొత్త ట్విస్ట్.. కారులో కీలక ఆధారాలు లభ్యం.. డ్రైవర్ సీట్‌లో

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే