Sai Dharam Tej – Vaishnav Tej: మెగా బ్రదర్స్ మధ్య బాక్సాఫీస్ వార్.. వారం గ్యాప్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలు..

మెగాస్టార్ మేనల్లుళ్లు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరూ హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. రేయ్ అనే సినిమాతో సాయి ధరమ్ తేజ్ హీరోగా..

Sai Dharam Tej - Vaishnav Tej: మెగా బ్రదర్స్ మధ్య బాక్సాఫీస్ వార్.. వారం గ్యాప్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలు..
Mega Heros
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 19, 2021 | 4:07 PM

Sai Dharam Tej & Vaishnav Tej: మెగాస్టార్ మేనల్లుళ్లు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరూ హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. రేయ్ అనే సినిమాతో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా వచ్చింది.. వెళ్ళింది ఎవ్వరికీ తెలియదు. ఆ వెంటనే వచ్చిన పిల్లనువ్వులేని జీవితం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు తేజ్. ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. అయితే చాలా కాలం హిట్స్ కోసం ఎదురుచూశాడు తేజ్. చివరకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన చిత్రలహరి సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత సినిమా కథల విషయంలో ఆచి తూచి అడుగులువేస్తున్నాడు. రీసెంట్‌గా ప్రతిరోజు పండగే, సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇప్పుడు దేవా కట్ట దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో తేజ్ కలెక్టర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే.

సుకుమార్ శిష్యుడు బిచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు వైష్ణవ్. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే 100కోట్ల క్లబ్‌లోకి చేరిపోయాడు ఈ యంగ్ హీరో. అయితే ఉప్పెన సినిమా కంటే ముందే క్రిష్ సినిమా చేశాడు. కరోనా సమయంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. కేవలం 45 రోజుల్లోనే ఈ సినిమాను పుర్తి చేశాడు దర్శకుడు క్రిష్. కొండపోలం అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తుంది. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆగస్టు 20న టైటిల్ అలాగే ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయనున్నారు. అయితే సాయి తేజ్ నటిస్తున్న రిపబ్లిక్ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ.. వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను అక్టోబర్ 1న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇలా ఒక వారం గ్యాప్‌లోనే మెగా బ్రదర్స్ మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది. ఈ ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shilpa Shetty: ఇంకా జైల్లోనే భర్త రాజ్ కుంద్రా.. కెమెరా ముందుకొచ్చిన శిల్పా శెట్టి

Mushroom Benefits: పుట్టగొడుగులతో మొటిమలకు చెక్.. ముఖం మరింత అందంగా కనిపించాలంటే మష్రూమ్స్ ఇలా వాడాల్సిందే..

TGWDCW Recruitment: తెలంగాణలో పది ఉత్తీర్ణులైన మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?