Mushroom Benefits: పుట్టగొడుగులతో మొటిమలకు చెక్.. ముఖం మరింత అందంగా కనిపించాలంటే మష్రూమ్స్ ఇలా వాడాల్సిందే..

పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయని తెలిసిన విషయమే. మన భారతదేశంలో కర్రీ నుంచి పిజ్జా వరకు

Mushroom Benefits: పుట్టగొడుగులతో మొటిమలకు చెక్.. ముఖం మరింత అందంగా కనిపించాలంటే మష్రూమ్స్ ఇలా వాడాల్సిందే..
Mushrooms
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 19, 2021 | 1:05 PM

పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయని తెలిసిన విషయమే. మన భారతదేశంలో కర్రీ నుంచి పిజ్జా వరకు వంటకాలలో పుట్ట గొడుగులను ఉపయోగిస్తుంటారు. అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మ సమస్యలను కూడా తగ్గిస్తాయి. చర్మ సౌందర్యాన్ని పెంచడంలో మష్రూమ్స్ సహాయపడతాయి. ఇవి యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని పొడి రూపంలో ఉపయోగించడం వలన అనేక ప్రయోజనాలుంటాయి. ఇవి చర్మాన్ని చల్లగా ఉంచుతాయి. అలాగే యవ్వనంగా ఉండేలా చేస్తాయి. మొటిమల సమస్యను తగ్గిస్తాయి. మరి ఈ పుట్టగొడుగును ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా

పుట్టగొడుగుల పొడి ఫేస్ ప్యాక్ అన్ని మెడికల్, కిరాణా స్టోర్స్‏లలో దొరుకుతుంది. ఇందులో విటమిన్ బి, సెలినీయం, రాగి ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.

మష్రూమ్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ ఓట్స్ – 1/3 కప్పు నిమ్మరసం- 2 టేబుల్ స్పూన్లు విటమిన్ ఇ క్యాప్సూల్స్ – 1

ముందుగా ఓట్స్, పుట్టగొడుగులను కలిపి పేస్ట్‏లా తయారు చేసుకోండి. తర్వాత అందులో నిమ్మరసం, విటమిన్ ఇ క్యాప్సూల్స్ కలపాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేయండి. ఈ పేస్ట్‌ని దాదాపు 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచి ముఖాన్ని నీటితో కడగండి. తర్వాత ముఖానికి అలోవెరా జెల్ రాయండి. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు. విటమిన్ డి శరీరానికి చాలా ముఖ్యం. శరీరంలో విటమిన్ డి లోపించినప్పుడు అనేక వ్యాధులు వస్తాయి. సహజంగా విటమిన్ డి అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు తక్కువగా ఉంటాయి. ఈ కూరగాయలలో ఒకటి పుట్టగొడుగులు. పుట్టగొడుగులలో విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. ప్రతిరోజూ పుట్టగొడుగులను తినడం వల్ల సహజంగా శరీరానికి అవసరమైనంత విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ డి తెల్ల పుట్టగొడుగులు , పోర్టెబెలా పుట్టగొడుగులలో కనిపిస్తుంది.

Also Read: Raja Raja Chora Review: ఇంతకీ శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ ప్రేక్షకుల మనసులు కొల్లగొడతాడా?

మహిళలు కాళ్లకు బంగారు పట్టీలు కాకుండా వెండి పట్టగొలుసులే ఎందుకు ధరిస్తారో తెలుసా..