AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brushing: బ్రష్ చేయకుండా బెడ్ కాఫీ, బ్రేక్‌ఫాస్ట్ తినే అలవాటుందా.. అయితే మీరు ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని తెలుసా

Brushing: రోజు ఉరుకులు పరుగుల జీవితం... జీతం కోసం వేట.. ఇక ఆధునికత పేరుతో మన సంప్రదాయాలను చాలా వరకూ పాటించడం మానేశాం. అందులో ఒకటి..

Brushing: బ్రష్ చేయకుండా బెడ్ కాఫీ, బ్రేక్‌ఫాస్ట్ తినే అలవాటుందా.. అయితే మీరు ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని తెలుసా
Brushing
Surya Kala
|

Updated on: Aug 20, 2021 | 7:16 AM

Share

Brushing: రోజు ఉరుకులు పరుగుల జీవితం… జీతం కోసం వేట.. ఇక ఆధునికత పేరుతో మన సంప్రదాయాలను చాలా వరకూ పాటించడం మానేశాం. అందులో ఒకటి సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. శుచిగా స్నానం చేసి.. ప్రశాంతంగా దేవుడికి ప్రార్ధన చేసి.. అప్పుడు దైనందిన జీవితంలోని పనులోకి అడుగు పెట్టేవాడు. అయితే ప్రస్తుతం కాలం మారింది. మనిషి ఆలోచనా తీరు.. అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి. అటువంటి ఒక మార్పు దంతాలను శుభ్రం చేసుకోకుండా నిద్ర లేచిన వెంటనే మంచంమీదనే బెడ్ కాఫీ తాగడం ఒకటి అయితే .. మరికొందరు ఏకంగా టిఫిన్ కూడా తినేస్తున్నారు. అయితే ఇలా బ్రష్ చేయకుండా బ్రేక్ పాస్ట్ చేయడం వలన తీవ్రమైన వ్యాధులబారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా గత కొంతకాలంగా చాలామంది నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌నే హ‌లిటోసిస్ అంటారు. దీనికి కారణం నోటి శుభ్ర‌త లేక‌పోవ‌డం అని దంత వైద్య నిపుణులు చెబుతున్నారు. మ‌నం తినే ఆహారపదార్ధాలు నోట్లో ఎంతో కొంత భాగం ఉండిపోతాయి. అవి ఎక్కువ సమయం నోట్లో ఉంటే ఆ ఆహారపదార్ధాలు కుళ్లిపోతాయి. అప్పుడు నోట్లో బాక్టీరియా త‌యార‌వుతుంది. ఫ‌లితంగా నోటి దుర్వాస‌న వ‌స్తుంది.

అందుకనే ఉదయమే నిద్ర లేచిన వెంటనే దంతాలను శుభ్రం చేసుకోవాలి. టూత్ పౌడ‌ర్ లేదా పేస్ట్ లేదా వేప పుల్ల‌ల‌తో దంతాల‌ను శుభ్రం చేసుకోవాలి. అలా తోముకోకపోతే నోట్లో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. అప్పుడు మనం తినే ఆహారంతో పాటు ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్లి.. అనేక వ్యాధులకు కారణం అవుతుంది. అందుకనే నోట్లో బాక్టీరియాను ఉన్నప్పుడు ఉద‌యం బెడ్ టీ, కాఫీ ల‌ను తాగ‌డం మంచిది కాదు. కొంద‌రు ఆహారం కూడా తింటారు. అందుల్లనే తప్పనిసరిగా ఉద‌యం దంతాల‌ను తోముకోవాలి. త‌రువాతే ఆహారాల‌ను లేదా టీ, కాఫీ వంటివి తీసుకోవాలి.

నోటి శుభ్రత లేక‌పోతే దంతాలు క్షీణిస్తాయి. పుచ్చిపోతాయి. దీంతో దంతాల‌ను తీసేయాల్సి వ‌స్తుంది. చిగుళ్ల స‌మ‌స్య‌లు వ‌స్తాయి. దంతాలు బ‌ల‌హీనంగా మారుతాయి. క‌నుక దంతాల‌ను రోజూ తోముకోవాలి. అంతేకాదు ఏమైనా తిన్న తర్వాత నోటిలో నీరు వేసుకుని పుక్కిలించి ఊసివేయాలి. ఇక ఉద‌యం, రాత్రి భోజ‌నం త‌రువాత దంతాల‌ను శుభ్రం చేసుకోవాలి. దంత సమస్య లేకపోతే చాలా వరకూ రోగాలకు దూరంగా ఉండొచ్చు అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: కంటి చూపు మెరుచుపరుచుకోవడానికి ఈ 3 వెజిటేరియన్‌ ఆహారాలు తినండి..! అసలు అద్దాలే అవసరం ఉండదు..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్