Papaya Side Effects: బొప్పాయిని అతిగా తింటున్నారా.. అయితే కొంతమందిలో కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి

Papaya Side Effects:బొప్పాయి మంచి ఔషధాల గని. కొందరు బొప్పాయిని పండుగా తింటారు.. మరికొందరు పచ్చి బొప్పాయిని కూరగా చేసుకుంటారు. ఇక బొప్పాయి ఆకులు ఔషధగుణాలతో నిండి ఉంది..

Papaya Side Effects: బొప్పాయిని అతిగా తింటున్నారా.. అయితే కొంతమందిలో కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి
Side Effects Of Papaya
Follow us

|

Updated on: Aug 20, 2021 | 7:40 AM

Papaya Side Effects:బొప్పాయి మంచి ఔషధాల గని. కొందరు బొప్పాయిని పండుగా తింటారు.. మరికొందరు పచ్చి బొప్పాయిని కూరగా చేసుకుంటారు. ఇక బొప్పాయి ఆకులు ఔషధగుణాలతో నిండి ఉంది. పెట్లెట్స్ తగ్గిన వారికీ ఈ బొప్పాయి ఆకుల రసాన్ని ఇస్తారు.. అంతేకాదు బొప్పాయి గింజలు కూడా ఆరోగ్యానికి మంచివి.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే బొప్పాయిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి. బొప్పాయి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. బొప్పాయిలోని ఫ్లేవనాయిడ్స్, ఫైబర్, పొటాషియం, క్యాల్షియం, మినరల్స్, మెగ్నీషియం వంటి పోషకాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఈ బొప్పాయి పండుని తింటే కొంతమందికి ఆరోగ్య ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈరోజు బొప్పాయి పండుని ఎవరు తినకూడదో చూద్దాం.. !!

బొప్పాయి అతిగా తింటే వేడి చేస్తుంది. దీనివలన ప్రెగ్నెన్సీ ఉన్నవారు తినకూడదని.. అలా తింటే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు ఎక్కువగా బొప్పాయి తింటే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే గర్భిణీ స్త్రీలు, బాలింతలు కొంత కాలం బొప్పాయిని తినకుండా ఉండడమే మంచిది.

రోగనిరోధక శక్తి పెరగడానికి విటమిన్ సీ అవసరమే.. అయితే ఎక్కువ విటమిన్ సీ తీసుకున్నా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. ఇక మగవారు ఎక్కువగా బొప్పాయి తింటే.. సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపిస్తుంది. రోజూ బొప్పాయి తినడంవలన కొంతమందిలో చర్మం రంగుమారుతుంది. కళ్ళు తెల్లగా అవుతాయి.. చేతులు ఆకుపచ్చగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కామెర్లు వచ్చే ప్రమాదం ఉంది.. అందుకనే బొప్పాయిని రోజూ తినే కంటే..మితంగా తినడం మంచిది. అతి సర్వత్రా వర్జయేత్ అన్న పెద్దల మాట గుర్తు పెట్టుకుని బొప్పాయిని ఎక్కువగా తిని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటే.. మితంగా వారానికి రెండు లేదా మూడు సార్లు తినడం ఆరోగ్యానికి మంచిది.

Also Read: బ్రష్ చేయకుండా బెడ్ కాఫీ, బ్రేక్‌ఫాస్ట్ తినే అలవాటుందా.. అయితే మీరు ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని తెలుసా