Milk Teeth: పిల్లలు తమ పాల దంతాలను ఎందుకు కోల్పోతారు.. దీని వెనుక అసలైన కారణం ఇదే..!

Milk Teeth: పిల్లల చిరునవ్వు చూడముచ్చటగా ఉంటుంది. అదేసమయంలో చూడముచ్చటైన వారి నోటిలో కనిపించే మొదటి తెల్లని ముత్యాలాంటి పళ్ళ వరస ఉంటుంది. మీ శిశువుకు..

Milk Teeth: పిల్లలు తమ పాల దంతాలను ఎందుకు కోల్పోతారు.. దీని వెనుక అసలైన కారణం ఇదే..!
Milk Teeth
Follow us
Subhash Goud

|

Updated on: Aug 20, 2021 | 8:45 AM

Milk Teeth: పిల్లల చిరునవ్వు చూడముచ్చటగా ఉంటుంది. అదేసమయంలో చూడముచ్చటైన వారి నోటిలో కనిపించే మొదటి తెల్లని ముత్యాలాంటి పళ్ళ వరస ఉంటుంది. మీ శిశువుకు పాల పళ్ళు ఒక పూర్తిస్థాయి సెట్ ఉంటుంది. అయితే పాల పళ్ళు ఊడిపోయి మరల శాశ్వతంగా వస్తాయని తరచూ తల్లిదండ్రులు కొన్ని నిర్లక్ష్యాలు చేస్తుంటారు. అందువలన పిల్లల పట్ల తల్లిదండ్రులకు అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం. పిల్లల్లో పాల పళ్లు పోవడం అనేది పిల్లల శరీరం సరిగ్గా అభివృద్ధి చెందుతుందనడానికి సంకేతం. బిడ్డ పుట్టిన తర్వాత వచ్చే పళ్లను పాల దంతాలు అంటారు. ఈ పళ్లు పోయిన తర్వాత శాశ్వత దంతాలు వస్తాయి. పిల్లలకు 20 పాల పళ్లు ఉంటాయి. 6 నెలల వయస్సు నుండి సంవత్సరం మధ్య సమయంలో పళ్ళు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది పిల్లల వయస్సు 3 నుండి 4 సంవత్సరాలు వరకు కొనసాగుతుంది.

వాటి కింద శాశ్వత దంతాలు రావటానికి సిద్ధంగా ఉన్నప్పుడు పాల పళ్ళు ఊడిపోవడం అనేది ప్రారంభం అవుతుంది. కేవలం కింది రెండు ముందు పళ్ళు సుమారు 6 సంవత్సరాల వయస్సు వద్ద వస్తాయి. తర్వాత ప్రతి సంవత్సరం పిల్లలు సుమారు రెండు నుండి నాలుగు పాలు పళ్ళను కోల్పోతారు. బిడ్డ మొదటి జన్మదినం వరకు మొదటి పాలు దంతం తాజా ఊడిపోవడం అనేది రెండూ ఏకకాలంలో జరుగుతాయి. అప్పుడు మీరు సరైన నోటి శుభ్రత, శిశువు పోషణ అలవాట్లు చేయాలి. ఇలా చేయడం వల్ల క్షయ వ్యాధిని నివారించడానికి మార్గాలు ఉన్నాయి. పిల్లలకు పాల పళ్ళు వచ్చినప్పుడు తరచుగా చిగుళ్ళ గాయాలు, లాలాజలం పెరుగుట, ఆకలి కోల్పోవడం జరుగుతాయి. వారు ఉపశమనం పొందేందుకు ఒక బొమ్మ లేదా వారి వేళ్లను చప్పరించటం వంటివి చేస్తారు. అపరిశుభ్రమైన వస్తువులు, వేళ్లు నమలడం వలన అతిసారం, జ్వరంనకు దారి తీయవచ్చు.

పిల్లలు అనారోగ్యంతో ఉన్నట్లయితే మీరు పిల్లల వైద్యులను సంప్రదించాలి. అయితే పాల దంతాల మూలాల నుంచి అసలైన దంతాలు పెరిగేకొద్ది పాల పళ్లు వదులుగా అవుతూ రాలిపోవడం ప్రారంభం అవుతుంది. హైపోపిట్యూటరిజం కారణంగా పిల్లలలో పాల పళ్లు పోవడం అనేది ఆలస్యం కావచ్చు. హైపోపిట్యూటరిజం కారణంగా పిట్యూటరీ తగినంత ట్రోఫిక్‌ హర్మోన్లను ఉత్పత్తి చేయలేకపోతుంది. ఈ కారణంగా పిల్లల పాల దంతాలు ఆలస్యంగా వస్తాయి. పోషకాలు లేకపోవడం వల్ల పాల దంతాలు కూడా ఆలస్యంగా రాలిపోతుంటాయి. శిశువు నిద్రిస్తున్న సమయంలో పాలు (రొమ్ము పాలు, సీసా పాలు) తాగే సమయంలో కొన్నిసార్లు మింగకుండా కొన్ని పాలు ఉంటాయి. ఇవి దంత క్షయంనకు కారణమయ్యే అవకాశం ఉందని పిల్లల వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు సంవత్సరంలో రెండు సార్లు దంత వైద్యులకు చూపించాలి.

ఇవీ కూడా చదవండి: Dental Care: పంటినొప్పితో బాధపడుతున్నారా.. పిప్పి పన్ను వేధిస్తోందా.. అయితే ఈ చిన్న చిట్కాతో అన్ని సమస్యలకు చెక్ పెట్టండి..

Crying Benefits: ఏడవడం వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా..? శిశువు మొట్టమొదటి ఏడుపు ఎంత ముఖ్యమంటే..

గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు