AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crying Benefits: ఏడవడం వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా..? శిశువు మొట్టమొదటి ఏడుపు ఎంత ముఖ్యమంటే..

Crying Benefits: ఏదైనా బాధలో ఉన్నప్పుడు కన్నీళ్లు రావడం అనేది సహజం. ఎవరైన సరే మరింత సంతోషంగా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకుంటారు. వీటిని ఆనంద..

Crying Benefits: ఏడవడం వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా..? శిశువు మొట్టమొదటి ఏడుపు ఎంత ముఖ్యమంటే..
Crying Benefits
Follow us
Subhash Goud

|

Updated on: Aug 18, 2021 | 10:34 AM

Crying Benefits: ఏదైనా బాధలో ఉన్నప్పుడు కన్నీళ్లు రావడం అనేది సహజం. ఎవరైన సరే మరింత సంతోషంగా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకుంటారు. వీటిని ఆనంద భాష్పాలు అంటారు. మనసులోని భావోద్వేగాలను అధిగమించలేకపోయినప్పుడు అది కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. అయితే ఏడ్వడం వల్ల అనేక ఉపయోగాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరం భావాలకు ప్రతిస్పందించినప్పుడు, మనసు కన్నీటి గ్రంథి నుంచి కళ్ల ద్వారా బయటకు వచ్చే నీటిని కన్నీళ్లుగా పిలుస్తాము. అయితే కన్నీళ్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏమిటో తెలుసుకుందాం.

శాస్త్రీయంగా ఏడవడానికి అనేక మార్గాలు:

అయితే శాస్త్రీయంగా ఏడవడానికి అనేక మార్గాలున్నాయి. భావోద్వేగాల నుండి వచ్చే కన్నీళ్లు వేరే రసాయన కూర్పును కలిగి ఉంటాయి. కంటి నొప్పి లేదా ఇన్ఫెక్షన్ నుండి వచ్చే కన్నీళ్లకు ఇది భిన్నంగా ఉంటుంది. ఈ వ్యాసంలో, మీ మనస్సు నుండి భావోద్వేగాలు బయటకు వచ్చినప్పుడు కన్నీళ్ళ నుండి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

వైద్య నిపుణుల ప్రకారం.. ఆరోగ్యానికి నవ్వు ఎంత ముఖ్యమో.. ఏడుపు కూడా అంతే ముఖ్యం. బాధపడుతూ ఏడిస్తే మెదడులో ఆక్సిటోసిన్‌, ఎండార్ఫిన్‌ అనే ఫీల్‌ గుడ్‌ రసాయనాలు విడుదలవుతాయి. కన్నీళ్ల వల్ల చెడు ఆలోచనలు దూరమైన, మానసిక ప్రశాంతత కలిగి పాజిటివ్‌ ఆలోచనల వైపు దృష్టి మళ్లుతుంది. కన్నీళ్లలో ఉండే ఐసోజైమ్‌లు క్రిములు, బ్యాక్టీరియాల నుంచి కన్నుకు రక్షణ ఉంటుంది. కన్నీళ్ల వల్ల కళ్లలో ఉండే దుమ్ము, మలినాలు బయటకు వెళ్లిపోతాయి. ఏడవడం వల్ల మెదుడు, శరీర ఉష్ణోగ్రతలు క్రమపద్దతిలో ఉంటాయి. అలాగే ఆక్సిటోసిన్‌, ఎండార్ఫిన్‌ వల్ల శారీరక, మానసిక భావోద్వేగాల్లో మార్పులు కలుగుతాయి. శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఉల్లిపాయ కోసినప్పుడు, కంటిలో దుమ్మూధూళి పడినప్పుడు కళ్ల మంట తగ్గించడానికి రెప్లెక్స్‌ టియర్స్‌ ఉపయోగపడుతుంది.

ఏడుపుతో మానసిక ఒత్తిడి దూరం..

ఎక్కువగా భావోద్వేగాలకు గురైనప్పుడు కన్నీళ్లు వస్తుంటాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం.. కన్నీళ్లలో కొన్ని విషపూరిత అంశాలు బయటకు వస్తాయి. ఇది శరీరంలోని ఒత్తిడి హర్మోన్ల ఉత్పత్తి తగ్గిస్తుంది. భావోద్వేగ కన్నీళ్లలో లైసోజైమ్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు సహాజ ప్రక్షాళనగా పని చేస్తాయి. అలాగే ఏడుపు వల్ల కలిగే మరో ఆరోగ్య ప్రయోజనం ఏంటంటే ఇది కంటికి తేమను ఇస్తుంది. ఏడుపు కళ్ల పొడిదనం, ఎరుపు మరియు దురదను నివారిస్తుంది. ఏడుపు డిప్రెషన్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఏడపు ప్రతికూల భావోద్వేగాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

శిశువుకు మొట్టమొదటి ఏడుపు చాలా ముఖ్యం:

అయితే స్త్రీ గర్భం నుంచి శిశువు బయటపడినప్పుడు శిశువు మొట్టమొదటి ఏడపు చాలా ముఖ్యమంటున్నారు. పిల్లలు బొడ్డు తాడు ద్వారా గర్భం లోపల తమ ఆక్సిజన్‌ను ఆందుకుంటారు. ఒక బిడ్డ ప్రసవించిన తర్వాత వారు స్వయంగ శ్వాసించడం ప్రారంభించాలి. మొదటి ఏడుపు ఏమిటంటే శిశువు ఊపిరితిత్తులు బయటి ప్రపంచంలో జీవితానికి అనుగుణంగా సహాయపడతాయి. ఏడుపు పిల్లలు ఊపిరితిత్తులు, ముక్కు మరియు నోటి ఏదైనా అదనపు ద్రవాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.

పిల్లలు నిద్రపోవడానికి..

ఏడుపు పిల్లలు రాత్రి బాగా నిద్రపోవడానికి కూడా ఎంతగానో సహాయపడుతాయని చైల్డ్‌ సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. పిల్లల ఏడుపు తమ పిల్లలను పడుకోబెట్టడానికి నియంత్రిత ఏడుపు గుర్తించారు. నియంత్రిత ఏడుపుతో పిల్లలు వారి తల్లిదండ్రుల జోక్యానికి ముందు కొన్ని నిమిషాల పాటు ఏడుస్తూనే ఉన్నారు. ఏడుపు ఎక్కువ సేపు నిద్రించడాన్ని ఉపయోగపడినట్లు గుర్తించారు. అలాగే రాత్రి సమయంలో శిశువులు నిద్రలేచిన సంఖ్యను తగ్గించింది.

ఇవీ కూడా చదవండి:  Anemia: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే రక్తహీనత కావచ్చు.. ఈ పదార్థాలు తీసుకోండి..!

High Blood Pressure: అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా.? ఈ ఐదు మార్గాలను అనుసరిస్తే అదుపులో ఉంటుంది..!