Corona Virus: తాజాగా అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు వెల్లడి.. కన్నీరుతో కూడా కోవిడ్ వ్యాపించే అవకాశం
Corona Virus: కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వ్యాధి. చైనాలో పుట్టిన ప్రపంచ దేశాల్లో గత 18 నెలలుగా కల్లోలం సృష్టిస్తుంది. కోవిడ్ బారిన పడిన రోగులు దగ్గినా,.
Corona Virus: కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వ్యాధి. చైనాలో పుట్టిన ప్రపంచ దేశాల్లో గత 18 నెలలుగా కల్లోలం సృష్టిస్తుంది. కోవిడ్ బారిన పడిన రోగులు దగ్గినా, తుమ్మినా , చేతులు కలిపినా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అయితే తాజాగా కరోనా వైరస్ వ్యాపించడం గురించి షాకింగ్ విజయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఓ వైద బృందం చేపట్టిన సర్వేలో ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ సోకిన రోగుల కన్నీళ్ల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందనున్నదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే..
పంజాబ్ లోని అమృత్‌సర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో కన్నీళ్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఎస్‌ఎల్ రహేజా ఆసుపత్రికి చెందిన డా.సంజిత్ శశిధరన్ ప్రకటించారు.
కరోనా వైరస్ బాధితుల కన్నీరుని పరీక్షించగా ఆ శాంపిల్స్ లో కోవిడ్ వ్యాప్తి అనేది 17.5 శాతంగా ఉందని తేలింది. ఓక్యులర్ మానిఫెస్టేషన్’ కలిగిన కరోనా రోగులతో సహా ‘ఓక్యులర్ మానిఫెస్టేషన్’ లేని కరోనా రోగుల నుంచి శాంపిల్స్ సేకరించారు శాస్త్రవేత్తలు. కళ్ళలో వైరస్ ఉనికి ఉందా అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. మలం, కన్నీరు వంటి ఇతర మార్గాల ద్వారా కోవిడ్-19 వ్యాధి వ్యాపిస్తుందా అనే కోణంలో పలు అధ్యయనాలు చేశారు.
కన్నీరు నుంచి కరోనా వైరస్ మరొకరికి ఎలా వ్యాపిస్తుందటే.. కన్నీరు పడిన చోట వైరస్ వ్యాపిస్తుందని.. కన్నీరు తాకిన వారికీ వ్యాధి సోకే అవకాశం ఉందని.. అంతేకాదు… కరోనా వైరస్ బాధితులు కన్నీరు తాకిన తర్వాత ఆ చేయి మరొకరికి తాకినా కరోనా వ్యాపిస్తుందన వైద్య సిబ్బంది వెల్లడించారు. అంతేకాదు కరోనా వైరస్ కండ్లకలక ద్వారా కూడా వ్యాపించవచ్చని.. వైద్యులు జాగ్రత్తలు చెబుతున్నారు. అందుకని కరోనా వైరస్ వచ్చినవారు కళ్ళను రుద్దుకోరాదు. దగ్గు, తుమ్ములు వచ్చిన సమయంలో ముక్కుకు టిష్యు తో కవర్ చేసుకోవాలి. అనంతరం వాటిని తగిన జాగ్రత్తలు తీసుకుని పడెయ్యాలి. వెంటనే చేతులను శుభ్రంగా కడుగుకోవాలి.
Also Read: కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి..? జీవి చేసేపనులతో ఫలితం అనుభవిస్తాడా