Karma Siddhanta: కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి..? జీవి చేసేపనులతో ఫలితం అనుభవిస్తాడా
Karma Siddhant: భారతీయ మతాల్లో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. భారతీయ మతాలు అంటే.. హిందూ మతం, దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం, సిక్కు మతం,, జైన మతం. ఈ నాలుగు..
Karma Siddhanta: భారతీయ మతాల్లో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. భారతీయ మతాలు అంటే.. హిందూ మతం, దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం, సిక్కు మతం,, జైన మతం. ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. కర్మ అంటే మానసికంగా గాని, శారీరకంగా గాని చేసింది. ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే అని హిందూమతంలో విశ్వాసం. చెడు కర్మకి ఫలితం, పాపానికి దుఃఖం, మంచి కర్మకి ఫలితం పుణ్యం.. పుణ్యానికి సుఖం అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్దాంతం. ఈ సిద్దంతమే హిందూ మతానికి పునాది.
కర్మ సిద్దాంతము ప్రకారం.. పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని తీసుకోవచ్చు. గత జన్మ లాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు. హిందూ మతం ప్రకారం మనుషులు మంచి, చెడులలో దేన్ని ఎంచుకోవాలో వారికే వదిలారు, కాని వాటి ప్రతి ఫలాలు అనుభవించేలా చేయడం భగవంతుని ఆధీనంలో ఉంటుంది. అంటే మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి. ఈ వ్యత్యాసం ఎరుగక కొందరు కర్మని విధి నిర్ణయంగా పొరబడతారు. ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా, స్వంతంగా అనుభవించాలి. ఎందుకంటే వారి పాప పుణ్యాలు వారికి మాత్రమే పరిమితం. తల్లి తండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందనడంలో నిజం లేదు. అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు.
భగవద్గీతలో సాంఖ్య యోగంలో కర్మం చేయడం వలన కలిగే ఫలితాలు చక్కగా వివరించారు శ్రీకృష్ణుడు.
కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన | మా కర్మ ఫల హేతురభుహ , మాఁ తే సంగీత్స్వ కర్మణ్యే ||
కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది . కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు . కర్మ ఫలానికి కారకుడివి కావద్దు . అలాగని కర్మలు చెయ్యడము మానవద్దని అర్ధం.
హిందూ ధర్మంలో జీవుడు భౌతిక శరీరాన్ని వదిలి పోయే సమయంలో పాపపుణ్యాలను, వాసనలను వెంట తీసుకు వెడాతాడని నమ్మకం . పాపపుణ్యాలు కర్మ చేయడం వలననే సంభవిస్తుంది. మానవుడు ఎలాంటి కర్మ చేయాలన్న నిర్ణయాధికారం అతడికే ఉందని భగవత్గీత వివరిస్తుంది. శ్రీకృష్ణుడు ఒక శ్లోకంలో ” కర్మచేయడం మీదే మనుష్యులకు అధికారం ఉంటుంది కాని కర్మ ఫలం మీద మీకు అధికారం లేదు ” అంటే సత్కర్మ లేక పాప కర్మ ఆచరించేది మానవుడే. కనుక గత జన్మలలో చేసిన పాప పుణ్య కర్మలు అనుభవింగా మిగిలినవి ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం వివరిస్తుంది. సత్కర్మాచరణ మానవులకు సుఖాన్ని, స్వర్గాన్ని ఇవ్వగలదని దుష్కర్మలు మానవునికి కష్టాలను నరకాన్ని ఇవ్వగలదని హిందూ ధర్మం బోధిస్తుంది. కనుక మానవుడు తాను చేసే కర్మలను సంస్కరించడం ద్వారా ఉన్నతిని సాధించవచ్చని, కష్టాలను అభిగమించ వచ్చని హిందూధర్మం బోధిస్తుంది. అంతేగాక భవంతుడిని ధ్యానించి గతజన్మ పాపా భారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాట వీలున్నదని బోధిస్తుంది.
Also Read: