Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shani: నేడే శని సంచారం.. ఏ రాశికి ఏలి నాటి శని ప్రారంభం.. వివిధ దశల్లో ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంటుంది? నివారణ చర్యలు

నవగ్రహాల్లో అత్యంత ప్రభావవంతమైన గ్రహం శని గ్రహం.. రవి సుతుడైన శనీశ్వరుడికి ఏ గ్రహాలకు లేని ప్రత్యేక స్థానం ఉంది. జాతకంలో పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర శని సంబంధిత నక్షత్రాలు. మనిషి చేసిన కర్మల నుంచి ఎలా తప్పించుకోలేరో.. ఏలి నాటి శని ప్రభావాన్ని కూడా తప్పించుకోలేరు. శనిశ్వరుడు ఏలి నాటి శని మూడు దశల్లో కొనసాగుతుంది. ప్రతి దశ రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఏలినాటి శని వివిధ దశలు ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకుందాం

Lord Shani: నేడే శని సంచారం.. ఏ రాశికి ఏలి నాటి శని ప్రారంభం.. వివిధ దశల్లో ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంటుంది? నివారణ చర్యలు
Lord Shani Dev
Follow us
Surya Kala

|

Updated on: Mar 29, 2025 | 8:18 AM

జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడిని కర్మ ఫలాలను ఇచ్చేవాడు. న్యాయ దేవుడిగా పరిగణిస్తారు. జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడిని క్రూరమైన, దయలేని గ్రహంగా భావిస్తారు. అంతేకాదు మంద గమనుడు అంటే అతి నెమ్మదిగా కలిదే గ్రహం కూడా.. శని దేవుడు రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో సంచరిస్తాడు. కనుక శనీశ్వరుడు మొత్తం 12 రాశులలో ప్రయాణించడానికి 30 సంవత్సరాలు పడుతుంది. రాశుల్లో శని సంచారాన్ని బట్టి.. ఆయా రాశులకు చెందిన వ్యక్తిపై ఏలి నాటి శని, శని దైయ్య భావం ఉంటుంది. శని ఏలి నాటి శని మూడు దశల్లో కొనసాగుతుంది. అంటే జాతకుని గోచారం ప్రకారం శనీశ్వరుడు ఒకొక్క రాశిలో 2 ½ ఏళ్లు ఉంటాడు. 12వ స్థానంలో ప్రవేశిస్తే.. ఏలి నాటి శని ప్రారంభం అవుతుంది. జాతకుడి 12 వ ఇంట, 1 ఇంట, 2వ ఇంట ఏలి నాటి శని ప్రభావం ఉంటుంది. ఇలా మొత్తంగా ఏడున్నర ఏళ్లు ఏలి నాటి శని ప్రభావం ఉంటుంది.

మార్చి 29న శని సంచారము

ప్రస్తుతం శనీశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో.. ఈ సమయంలో మకరం, కుంభం, మీన రాశుల వారిపై ఏలి నాటి శని ప్రభావం కొనసాగుతోంది. ప్రస్తుతం శనీశ్వరుడు ఏలి నాటి శని చివరి దశ మకర రాశి వారిపై, మొదటి దశ మీన రాశి వారిపై, రెండవ దశ కుంభ రాశి వారిపై జరుగుతోంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం మార్చి 29న శనీశ్వరుడు సంచారం జరగనుంది. ఈ రోజున, శని దేవుడు కుంభ రాశి నుంచి బయలుదేరి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. శనీశ్వరుడు రాశి మార్పుతో మకర రాశి వారిపై ఉన్న ఏలి నాటి శని ముగిసి మేష రాశి వారికి ప్రారంభమవుతుంది. కుంభ రాశి వారికి ‘ఏలి నాటి శని ‘ చివరి దశ ప్రారంభమవుతుంది. మీన రాశి వారికి రెండవ దశ ప్రారంభమవుతుంది.

ఏలి నాటి శని మొదటి దశ ప్రభావం

ఏలి నాటి శని మొదటి దశలో శనీశ్వరుడు జాతకుడి తలపై కూర్చుంటాడని నమ్ముతారు. ఏలి నాటి శని మొదటి దశలో వీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో ప్రజలు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. ఏ పని మొదలు పెట్టినా అడ్డంకులను ఎదుర్కొంటారు. ఇవన్నీ కలిపి వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.

ఇవి కూడా చదవండి

రెండవ దశ ప్రభావం

రెండవ దశలో ఏలి నాటి శనిప్రభావం జాతకుడి కుటుంబంపై పడుతుంది. రెండవ దశలో కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు నెలకొంటాయి. కుటుంబ సంబంధిత సవాళ్ళు ఎదురవుతాయి. ఈ సమయంలో వీలైంత వరకూ తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. రెండవ దశలో శనీశ్వరుడు వీరిని మరింత కష్టపడి పనిచేసేలా చేస్తాడు.

మూడవ దశ ప్రభావం

ఏలి నాటి శని మూడవ దశలో.. భౌతిక సుఖాలు తగ్గుతాయి. ఖర్చులపై నియంత్రణ ఉండదు. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. స్నేహితుల మధ్య అనవసరమైన వివాదాలు తలెత్తవచ్చు.

శని దోష ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అంటే..

ఏలినాటి శని తీవ్రతను తగ్గించుకోవాలంటే.. ఆయా రాషులవారు హనుమంతుడిని పూజించండి. హనుమాన్ చాలీసా, .ఆంజనేయ దండకం చదవండి. అంతేకాదు విష్ణు సహస్రనామం, రుద్ర నమక చమకాలు, ఆదియ హృదయం, సుందరాకాండ పారాయణం చేయండి శని స్తోత్రం, శని చాలీసా,శని అష్టోత్తర సహస్రనా స్త్రోత్రం చేయడం వలన కొంత మేర శని ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు