- Telugu News Photo Gallery Spiritual photos Famous Sun Temples in India: History, Significance and Travel Guide
Sun Temples in India: ఐశ్వర్యం, ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడి ఆలయాలు.. దర్శనంతోనే ఆశీస్సులు మీ సొంతం..
హిందూ మతంలో నవ గ్రహాలకు అధిపతి సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడు శక్తి కేంద్రంగా పరిగణించబడుతున్నాడు. ఆరోగ్య ప్రదాతగా ప్రత్యక్ష దైవంగా పూజలను అందుకుంటున్నాడు. సూర్య భగవానుడికి దేశవ్యాప్తంగా ఇలాంటి అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇవి ప్రజల విశ్వాసానికి మాత్రమే కేంద్ర బిడువులు కాదు.. వాటి గొప్పతనం, అందంతో కూడా ప్రసిద్ధి చెందాయి.
Updated on: Mar 28, 2025 | 10:43 AM

సూర్యభగవానుడు మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనవాడు. ఇదే విషయాని పురాణ గ్రంథాలలో పేర్కొన్నారు. సైన్స్ ద్వారా కూడా నిరూపించబడింది. పూర్వకాలంలోనే సూర్యుడి జీవితంలో ప్రాముఖ్యతను అర్థం చేసుకుని సూర్య దేవాలయాలు నిర్మించబడి ఉండవచ్చు. దేశవ్యాప్తంగా అనేక ప్రసిద్ధ సూర్య భగవానుడి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలను చూడటానికి దేశవ్యాప్తంగా మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తారు.

సూర్యభగవానుడిని పూజించడం వల్ల గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయని.. ఆరోగ్యంగా ఉంటారని మత విశ్వాసం ఉంది. అంతేకాదు సూర్య దేవుడిని పూజించడం వలన జీవితంలోని వైఫల్యాలు తొలగి.. విజయం దక్కేటట్లు ఆశీర్వదిస్తాడు. ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం నుంచి గుజరాత్‌లోని మోధేరా సూర్య దేవాలయం వరకు ఆధ్యాత్మిక రహస్యాలు ఇందులో దాగి ఉన్నాయి. దేశంలోని ఏడు ప్రధాన సూర్య దేవాలయాల గురించి తెలుసుకుందాం..

కోణార్క్ సూర్య దేవాలయం: సూర్య భగవానుడి ప్రసిద్ధ ఆలయాలలో మొదటగా గుర్తుకు వచ్చే ఆలయం కోణార్క్ సూర్య దేవాలయం. ఒడిశాలో ఉన్న కోణార్క్ సూర్య దేవాలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని శ్రీ కృష్ణుడి కుమారుడు సాంబుడు నిర్మించాడని నమ్ముతారు. ఆ తరువాత ఈ సూర్య దేవాలయాన్ని 13వ శతాబ్దంలో రాజు నరసింహదేవ పునర్నిర్మించాడు. అదే సమయంలో ఈ ఆలయం దాని ప్రత్యేకమైన ఆకారం , శిల్పకళా సంపదతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఈ ఆలయం మరో ప్రత్యేకత ఏమిటంటే సూర్యోదయపు మొదటి కిరణం ఆలయ ప్రధాన ద్వారం వద్ద పడుతుంది.

ఆంధ్రప్రదేశ్ లోని సూర్యనారాయణ ఆలయం: ఆంధ్రప్రదేశ్‌లోని అరసవల్లి గ్రామానికి తూర్పున 1 కి.మీ దూరంలో, 1300 సంవత్సరాల పురాతనమైన సూర్య భగవానుడి ఆలయం ఉంది. ఇక్కడ సూర్యనారాయణుడు తన భార్యలైన సంధ్య, ఛాయలతో కలిసి పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే.. సూర్యుని మొదటి కిరణం సంవత్సరానికి రెండుసార్లు నేరుగా విగ్రహంపై పడుతుంది. ఈ ఆలయంలో సూర్య భగవానుడిని దర్శించుకోవడం వలన సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్మకం.

ఔరంగబాద్ దేవ్ సూర్య దేవాలయం: బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో సూర్యదేవుని ప్రత్యేకమైన ఆలయం ఉంది. దీనిని డియో సన్ టెంపుల్ అని కూడా అంటారు. విశ్వకర్మ ఈ సూర్య దేవాలయాన్ని ఒకే రాత్రిలో నిర్మించాడని నమ్ముతారు. అంతేకాదు ఈ ఆలయం ప్రధాన ద్వారం తూర్పు వైపు కాకుండా పశ్చిమం వైపు ఉంది. ఏడు రథాలపై ప్రయాణించే సూర్య భగవానుడి మూడు రూపాలను ఇక్కడ చూడవచ్చు. మత విశ్వాసాల ప్రకారం ఈ సూర్య దేవాలయ ద్వారం రాత్రి సమయంలో స్వయంచాలకంగా మరొక దిశకు మారిపోయింది.

బేలూర్ సూర్య దేవాలయం, బీహార్: భోజ్‌పూర్ జిల్లాలోని బెలూర్ గ్రామానికి పశ్చిమ, దక్షిణ చివరలో ఉన్న బేలూర్ సూర్య దేవాలయం ప్రపంచ ప్రసిద్దిగాంచింది. ఈ ఆలయం రాజు నిర్మించిన 52 చెరువులలో ఒకదాని మధ్యలో నిర్మించబడింది. ఈ ప్రదేశంలో ఛత్ పూజ సమయంలో నిర్మలమైన హృదయంతో పూజిస్తే కోరికలు నేరవేతరాయని నమ్మకం. ఈ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.

మోధేరా సూర్య దేవాలయం: గుజరాత్‌లో ఉన్న మోధేరా సూర్య దేవాలయం దీని నిర్మాణ శైలితో పపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. దీనిని సోలంకి రాజవంశానికి చెందిన రాజు భీమ్‌దేవ్ I 1026 ADలో నిర్మించాడు. మోధేరా సూర్య దేవాలయం రెండు భాగాలుగా నిర్మించబడిందని.. అందులో మొదటి భాగం గర్భగుడి.. రెండవ భాగం అసెంబ్లీ హాలు అని మీకు తెలియజేద్దాం. అదే సమయంలో, సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోకి పడే విధంగా ఆలయం నిర్మించబడింది.

కాశ్మీర్ మార్తాండ దేవాలయం: దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయాలలో కాశ్మీర్‌లోని మార్తాండ్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయం కాశ్మీర్ దక్షిణ భాగంలో అనంతనాగ్ నుంచి పహల్గామ్ వెళ్ళే మార్గంలో మార్తాండ అనే ప్రదేశంలో ఉంది. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో కార్కోట రాజవంశానికి చెందిన రాజు లలితాదిత్య నిర్మించాడని మతపరమైన నమ్మకం ఉంది.

ఝలావర్, సూర్య దేవాలయం: రాజస్థాన్‌లోని ఝలావర్‌లోని రెండవ జంట నగరాలను, అంటే ఈ నగరాలను ఝలావర్, ఝలావర్‌పటన్‌ను బావుల నగరం అని కూడా పిలుస్తారు. ఈ జంట నగరాల మధ్యలో ఉన్న సూర్య దేవాలయం ఒక పర్యాటక ప్రదేశం. అదే సమయంలో దీనిని పదవ శతాబ్దంలో మాల్వాకు చెందిన పర్మార్ రాజవంశ రాజులు నిర్మించారు. ఈ ఆలయ గర్భగుడిలో విష్ణువు విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని పద్మనాభ దేవాలయం అని కూడా అంటారు. గర్భగుడిలో 19వ శతాబ్దంలో నాలుగు చేతుల పద్మనాభ మూర్తి ఉంది





























