Hyderabad: కొడుకు BSNLలో ఉద్యోగి.. అయినా సరే కట్నం సరిపోలే.. కట్ చేస్తే.. కటకటాల్లో తల్లీకొడుకులు!
హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న కేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అదనపు కట్నం కోసం అత్తవారి ఇంటి వేధింపులు తాళలేక ఒక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. 2017 లో చైతన్యపురిలో ఈ ఘటన పెను దుమారం రేపింది.

హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న కేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అదనపు కట్నం కోసం అత్తవారి ఇంటి వేధింపులు తాళలేక ఒక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. 2017 లో చైతన్యపురిలో ఈ ఘటన పెను దుమారం రేపింది. ఈ ఘటన పై బాధితురాలు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ఈ కేసులో అన్ని సాక్షాధారాలను పగడ్బందీగా పోలీసులు కోర్టుకు సమర్పించారు. దీంతో రంగారెడ్డి కోర్టు శుక్రవారం(మార్చి 28) సంచలన తీర్పు ప్రకటించింది. ఈ తీర్పులో అదనపు కట్నం కోసం వేధించిన భర్త ఆనంద్ తోపాటు ఆనంద్ తల్లి భారతమ్మను సైతం రంగారెడ్డి కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఇద్దరికీ కఠిన శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
బాధితురాలు ఆత్మహత్యకు పరోక్షంగా కారణమైన భర్త ఆనంద్‌కు జీవిత ఖైదీగా శిక్ష విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది. మరోవైపు అదనపు కట్నం తీసుకురావాలని వేధించిన అత్త భారతమ్మకు సైతం రంగారెడ్డి కోర్టు తగిన బుద్ధి చెప్పింది. ఆనంద్ తల్లి భారతమ్మను సైతం కోర్టు శిక్షించింది. ఆమెకు ఏడు సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బాధితురాలి ఆత్మహత్యకు కారణమైన కేసులో ఏ1 గా బాధితురాలి భర్త ఆనంద్ కాగా ఏ2 గా ఆనంద్ తల్లి భారతమ్మ ఉన్నారు. వీరి వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు
కేసుకు సంబంధించి అనేకమంది సాక్షులను విచారించిన తర్వాత రంగారెడ్డి కోర్టు ఈ తీర్పు ప్రకటించింది. రంగారెడ్డి కోర్టు తీర్పు పై త్వరలోనే హైకోర్టులో అపీలు చేయనున్నట్లు నిందితుల తరపు న్యాయవాది తెలిపాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..