Horoscope Today: ఉద్యోగస్తులు శుభవార్త వింటారు.. ఆదాయ వ్యవహారాలను వాయిదా వేస్తే మంచిది..
Today Rasi Phalalu: నిత్యం మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ
Today Rasi Phalalu: నిత్యం మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే.. బుధవారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా లేవు. ఈ రోజు రాశిఫలాలు ఓ సారి చూద్దాం..
మేష రాశి : సహనం సరైన ప్రణాళికతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. నిరాశావాదంతో సాధించేది ఏమీ లేదు. దానివలన సరైన ఆలోచనలు చేయలేరు. దైవ ప్రార్ధన వల్ల మానసిక బలం. ఆదాయం పర్వాలేదు ముఖ్యమైన అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. తోటి ఉద్యోగులతో సామరస్యంగా ప్రవర్తించండి. కుటుంబ సభ్యులతో ఆదాయ వ్యవహారాల గురించి చర్చిస్తారు.
వృషభ రాశి : వ్యాపార విస్తరణ కోసం చేస్తున్న ప్రయాణాలు లాభాలను తెస్తాయి. సంఘంలో పేరుప్రతిష్టలు. ఉద్యోగస్తులకు శుభవార్త. ఆఫీసు పనులను సామర్థ్యం ఉపయోగించి పూర్తి చేస్తారు. ఆదాయ వ్యవహారాల గురించి ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. స్నేహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి ముఖ్యంగా పిల్లలతో గడపటం మీకు ఎంతో ఎనర్జీ.
మిథున రాశి : అదృష్టం మీ పక్షాన ఉంది ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మీ పిల్లల చదువులకు ఒక కంట గమనించండి. వారు సమయం వృధా చేయకుండా గమ్యం వైపు పయనించే టట్లు చూడండి. పాత బకాయిలు వసూలవుతాయి. తోటి ఉద్యోగులు మీమీద ఆజమాయిషి చలా ఇద్దామని చూస్తున్నారు జాగ్రత్త. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీ పై అధికారులు గమనిస్తున్నారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితం లో ఒక తీపి గుర్తు.
కర్కాటక రాశి : అదృష్టం మీ పక్షాన ఉంది ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు ధైర్యంగా తీసుకోండి లాభాలను తెస్తాయి. మీరు చెప్పిందే కరెక్ట్ అని మొండి వాదనలు చేయకండి. ఆఫీసులో పనులను మీ సామర్థ్యం ఉపయోగించి సకాలంలో పూర్తి చేస్తారు కొందరికి ప్రమోషన్. కొందరికి జీతాల పెరుగుదల. ఆదాయం బాగున్నా అనవసరపు ఖర్చులు కంగారు తెప్పిస్తాయి.
సింహరాశి : ఆటంకాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయటానికి ప్రయత్నించండి పెండింగ్ పెట్టడం వల్ల ఇబ్బందులు. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. వ్యాపారులకు లాభాలు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు నష్టాలను తెస్తాయి జాగ్రత్త.
కన్యారాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే సహనం పట్టుదల అవసరం. గందరగోళం వదిలేయండి. దానివల్ల సరైన ఆలోచనలు రావు సరికదా సమస్యల పెద్దవవుతాయి. దైవ ప్రార్ధన వలన మానసిక బలం. వ్యాపారులకు ఊహించని లాభాలు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల అవసరాలను గమనించండి వారు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు.
ధనుస్సు రాశి : సహనము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. ఆఫీసు పనుల్లో అధిక శ్రమ వల్ల ఆలస్యం అయ్యే అవకాశం. జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. స్నేహితులతో పరుషంగా మాట్లాడకండి. వారు హర్ట్ అయ్యే అవకాశం. ప్రయాణాలలో వస్తువులు డబ్బు జాగ్రత్త. అధిక శ్రమ వల్ల మోకాళ్ల నొప్పులు.
తులారాశి : ఆత్మవిశ్వాసంతో సరైన ప్రణాళికతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కొత్త కాంట్రాక్టులు కొత్త స్నేహితులు. అయిపోయిన విషయాలను గురించి వదిలేయండి భవిష్యత్తు వైపు చూడండి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. వాటి లోనికి బంధువులు స్నేహితులను రానీయకండి. ఆఫీసు పనులను నిబద్దతతో, తోటి ఉద్యోగులు అసూయపడేలా సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులు నూతన భాగస్వామ్య వ్యాపారాలలో నికి ఎంటర్ అవుతారు.
వృశ్చిక రాశి : ఆత్మవిశ్వాసము సరైన ప్రణాళికతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మరింత సంపాదన కోసం నూతన మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి వారి అభిప్రాయాలు తెలుసుకోండి ఆఫీసు పనుల మీద శ్రద్ధ పెట్టండి తోటి ఉద్యోగుల సహాయం తీసుకోండి. పుకార్లు నమ్మకండి దూరంగా ఉండండి. ఆదాయం పర్వాలేదు అనవసరపు ఖర్చులను నివారించండి.
మకర రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఉక్కు, హోటల్ వ్యాపారం చేసే వారికి లాభాలు. ఆఫీసులో పనులను అధిక సామర్థ్యం తో సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం పర్వాలేదు. కుటుంబ సభ్యులు కలిసి ఆనందంగా గడుపుతారు షాపింగ్ చేస్తారు. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకోకండి. ప్రేమికులు తమ ప్రేమ గురించి నిర్భయంగా చెప్పటానికి మంచి తరుణం.
కుంభరాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఆత్మవిశ్వాసం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మంచి రోజుల కోసం సహనంతో వేచి ఉండండి. ఆఫీసులో ఈ రోజు చాలా యాక్టివ్ గా ఉంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ భార్య భర్తల సామరస్య ధోరణి వల్ల కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ఆదాయం పర్వాలేదు.
మీన రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. పూర్తి ఎనర్జీతో పని చేస్తారు. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అందరి ప్రశంసలు పొందుతారు. కావాల్సినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అలా అని నిర్లక్ష్యం వహించకండి. ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం చేసే వారు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి వారితో వాదోపవాదాలకు దిగకండి.