AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ నాలుగు రాశులవారు ప్రేమించినవారిని కష్ట సమయాల్లో ఒంటరిగా వదిలిపెట్టరు.. అందులో మీరున్నారా?

జోతిష్యం, రాశిఫలాలు వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చాలామంది నమ్ముతుంటారు. జీవితంలోని ముఖ్య ఘటనలు రాశి చక్రం ఆధారంగా..

Zodiac Signs: ఈ నాలుగు రాశులవారు ప్రేమించినవారిని కష్ట సమయాల్లో ఒంటరిగా వదిలిపెట్టరు.. అందులో మీరున్నారా?
Zodiac Signs
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Aug 18, 2021 | 1:00 PM

జోతిష్యం, రాశిఫలాలు వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చాలామంది నమ్ముతుంటారు. జీవితంలోని ముఖ్య ఘటనలు రాశి చక్రం ఆధారంగా జరుగుతాయని భావిస్తుంటారు. అందుకే ప్రతీ పని మొదలుపెట్టే ముందు రాశిఫలాలు ఒకసారి పరిశీలిస్తుంటారు. ఏ సమయంలో ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది? మంచి సమయం ఎప్పుడుంది.? ఇలా అనేక వివరాలను తెలుసుకుంటారు.

కొందరు వ్యక్తులు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. మరికొందరు చుట్టూ స్నేహితులు ఉండాలని కోరుకుంటారు. ఇలా అందరితోనూ సంతోషంగా ఉండే వ్యక్తులను చాలామంది ఇష్టపడుతుంటారు. ఇదిలా ఉంటే.. ప్రేమ అనే బంధాన్ని ఏర్పరుచుకోవడం సులభమే. కానీ ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బంధాన్ని బలంగా ఉంచుకునే అవకాశం ఉన్నవారిలో ఈ నాలుగు రాశుల వారు ప్రధానంగా ఉంటారు. ఈ నాలుగు రాశులవారు ప్రేమించిన వ్యక్తులను కష్టసమయాల్లో అస్సలు విడిచిపెట్టరని అంటారు. మరి ఆ నాలుగు రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటకం:

ఈ రాశివారు జాగ్రత్తపరులు. వారు ఎవరితోనైనా బంధం ఏర్పరుచుకుంటే.. వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారు. వారి బాధలను తమ బాధలుగా భావించి.. ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఈ రాశి వ్యక్తులు చాలా సున్నిత స్వభావం కలిగినవారు. ఎవరైనా కలత చెందుతున్నట్లు కనిపించినట్లయితే.. వారి ముఖంపై చిరునవ్వు తెప్పించేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి వ్యక్తులను ఖచ్చితంగా మీ స్నేహితులను చేసుకోండి.

కన్య:

ఈ రాశి వ్యక్తులు ఎవరితోనూ సులభంగా కలవరు. ఒక్కసారి కనెక్ట్ అయితే మాత్రం.. వారి మీ సంతోషంలో గానీ, బాధలోనైనా మీ వెన్నంటే ఉంటారు. కష్ట సమయాల్లో మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టరు. ఈ రాశివారు సామాజిక సేవను సైతం ఇష్టపడతారు.

తుల:

ఈ రాశి వ్యక్తులు అత్యంత కేరింగ్‌ తీసుకుంటారని అంటారు. వీరితో మీ బంధం సరిగ్గా లేకపోయినా.. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మానవత్వంతో వారు మీకు సహాయం చేస్తారు. ఎదుటవారు బాధలో ఉన్నారన్నది వీరు ఇట్టే గుర్తించగలరు. వారిని సంతోషపెట్టేందుకు ఏదైనా చేస్తారు. అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉంటే, వారిని ఎప్పటికీ వదలకండి.

మిథునం:

ఈ రాశి వారికి చాలా మంది స్నేహితులు ఉంటారు. వారు తమ బంధువులతో కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తుంటారు. కష్ట సమయాల్లో వీరినే మొదటిగా తలుచుకోండి. సహాయం కోరినప్పుడు ఖచ్చితంగా నో చెప్పరు. తమకు వీలైనంత వరకు సాయాన్ని చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశివారి స్వభావం చాలా దయగలిగింది.

Also Read: త్రివర్ణపతాకం పోస్టర్‌లో సోనూ సూద్ ఫోటో.. రియ‌ల్ హీరో ఆఫ్ ఇండియా అంటున్న అభిమాని

సావిత్రితో ఉన్న ఈ బాలనటుడు.. ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో కనిపెట్టండి చూద్దాం..

భర్త మరో మహిళతో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..! తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

భార్య పేరు మీద ఇల్లు కొనుగోలు చేస్తున్నారా?.. ఆసక్తికర విషయాలు మీకోసమే..