Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారు సహనంతో వ్యవహరించాలి.. భార్య భర్తలు ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకోవాలి..

Today Rasi Phalalu: నిత్యం మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ,

Horoscope Today: ఈ రాశివారు సహనంతో వ్యవహరించాలి.. భార్య భర్తలు ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకోవాలి..
Horoscope Today
Follow us
uppula Raju

|

Updated on: Aug 19, 2021 | 5:59 AM

Today Rasi Phalalu: నిత్యం మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే.. గురువారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా లేవు. ఈ రోజు రాశిఫలాలు ఓ సారి చూద్దాం..

మేష రాశి : సహనంతో వ్యవహరించండి. మీకు ఏం కావాలో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. రాత్రికి రాత్రి ఏ అద్భుతాలు జరిగిపోవు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి ఇవే విషయాలు వారికి చెప్పండి. ఆఫీస్ పనులను అధికశ్రమ ఉపయోగించి పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకోండి. నమ్మకమే మీ వైవాహిక జీవితానికి పునాది.

వృషభ రాశి : అధిక శ్రమ పట్టుదలతో అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు. కావలసినంత ధనం చేతికందుతుంది. ఇంతకు ముందు డబ్బుకు ఇబ్బంది వలన ఆగిపోయిన పనులను పూర్తిచేస్తారు. ఎలక్ట్రానిక్స్ వ్యాపారం లాభాలు. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సరైన పథకాలలో పెట్టుబడులు పెట్టండి లేకుంటే డబ్బుకి ఇబ్బంది పడతారు.

మిథున రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. అనుకోని ధనలాభం. వ్యాపారస్థులకు మీ కష్టాలు తీరే రోజు. ప్రభుత్వ టెండర్లు దక్కించుకుంటారు. ఆఫీసు పనుల మీద శ్రద్ధ పెట్టండి. ఎవ్వరితోనూ వాదోపవాదాలకు దిగకండి. మీ పై అధికారులు గమనిస్తున్నారు. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం. కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు, కోరికలకు విలువ ఇవ్వండి.

కర్కాటక రాశి : ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. నూతన పరిచయాలు నూతన స్నేహితులు కోపాన్ని అదుపులో పెట్టుకోండి లేకుంటే లేనిపోని గొడవలు జరుగుతాయి. వ్యాపారంలో ఇతరుల నుంచి వచ్చిన ఒత్తిడితో నిర్ణయాలు తీసుకోకండి. నిరుద్యోగులు ఉద్యోగం కొరకు మరింత కష్టపడాలి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. బంధువుల నుంచి అందిన శుభవార్త వలన కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం.

సింహరాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక అదృష్టమూ తప్పనిసరి. కావలసినంత ధనం చేతికందుతుంది రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పెట్టుబడులు పెడతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు మరింత కష్టపడండి విజయం లభిస్తుంది. మీరు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆఫీసు పనుల మీద శ్రద్ధ పెట్టండి.

కన్య రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక సహనం తప్పనిసరి. కుటుంబ ఖర్చుల గురించి ఇంట్లో పెద్దవారితో చర్చిస్తారు. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు. నిరుద్యోగులకు శుభవార్త. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు లాభాల కోసం మరికొంత కాలం వేచి ఉండండి. బంధువుల నుండి అందిన శుభవార్త వలన ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం.

తులారాశి : పట్టుదల ఆత్మవిశ్వాసం తో అనుకున్న కార్యాలు సాధిస్తారు. ఇప్పటివరకు పడిన టెన్షన్స్ తగ్గుముఖం పడతాయి. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. కొన్ని పథకాల లో పెట్టిన పెట్టుబడులు నష్టాలను తెస్తాయి. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు. కొందరికి ప్రమోషన్ కొందరికి ట్రాన్స్ ఫర్. రిటైల్ వ్యాపారం చేసే వారికి లాభాలు.

వృశ్చిక రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక సహనము తప్పనిసరి. వారసత్వంగా రావలసిన స్థిరాస్తి వ్యవహారాల మీద గొడవలు జరుగుతాయి. జాగ్రత్త వహించండి. తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. కోపతాపాలను అదుపులో పెట్టుకోండి. వ్యాపారులు తగిన లాభాల కోసం మరికొంత కాలం వేచి ఉండండి. తోడబుట్టిన వారు మరియు స్నేహితుల సహాయం లభిస్తుంది. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయలేక పోవడం వలన మానసిక అశాంతి. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోండి. నమ్మకమే మీ వైవాహిక జీవితానికి పునాది.

ధనుస్సు రాశి : మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. గందరగోళంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకోకండి. దైవ ప్రార్ధన వల్ల మానసిక బలం. సహోదరుల సహాయం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు నూతన అవకాశాల కోసం వెతుకుతారు మార్కెటింగ్ లో ఉన్నవారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడాలి. చిరు వ్యాపారులకు లాభాలు. ఆఫీసు పనులలో అధిక శ్రమ.

మకర రాశి : ఆటంకాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. పై చదువుల కోసం విదేశాలకు వెళదామని ప్రయత్నాలు చేస్తున్న వారు మరింత కష్టపడాలి. ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళటానికి మానసికంగా బలంగా ఉండండి. మనసును అదుపులో ఉంచుకొన్న వారికి మాత్రమే మంచి చెడు తెలుస్తాయి. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయడానికి సరైన ప్రణాళిక అధిక సామర్ధ్యము తప్పనిసరి.

కుంభరాశి : ఒకే రకమైన పనులు చేసి అలసిపోయి విసిగిపోయిన మీకు ఈరోజు ఆటవిడుపు. అనవసరపు దుబారా ఖర్చులను చేయటం వల్ల కలిగే డబ్బు ఇబ్బందిని ఈరోజు గుర్తిస్తారు. ఆదాయ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయండి. స్నేహితుల సహాయం లభిస్తుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే మీ జిజ్ఞాస అందరినీ మెప్పిస్తుంది. ఆఫీసు పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వలన పై అధికారులతో ఇబ్బందులు.

మీన రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. వారితో గడపటం వల్ల మీకు ఎంతో ఎనర్జీ మరియు ఆనందం. ఈ కరోనా సమయములో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి అనుకోని ధనలాభం.