AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Childhood Pic: సావిత్రితో ఉన్న ఈ బాలనటుడు.. ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో కనిపెట్టండి చూద్దాం..

Childhood Pic Goes Viral: బాల్యాన్ని గుర్తు చేసే చిన్నప్పటి ఫోటోలు అంటే అపురూపం. సామాన్యులకైనా, సెలబ్రెటీలకైనా చిన్నతనంలో ఫోటోలు ఎంతో ఇష్టంగా దాచుకుంటారు. అయితే కొంతమంది..

Childhood Pic: సావిత్రితో ఉన్న ఈ బాలనటుడు.. ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో కనిపెట్టండి చూద్దాం..
Kamal Childhood Pic
Surya Kala
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 18, 2021 | 12:57 PM

Share

Childhood Pic Goes Viral: బాల్యాన్ని గుర్తు చేసే చిన్నప్పటి ఫోటోలు అంటే అపురూపం. సామాన్యులకైనా, సెలబ్రెటీలకైనా చిన్నతనంలో ఫోటోలు ఎంతో ఇష్టంగా దాచుకుంటారు. అయితే కొంతమంది బాలనటులుగా వెండి తెరపై అడుగు పెట్టి.. కాలక్రమంలో హీరోలు, హీరోయిన్లుగా అలరిస్తుంటారు. ఒకొక్కసారి సెలబ్రెటీల చిన్నతనంలో ఫోటోలే కాదు.. వారు నటించిన బాల్యంలోని ఫోటోలు బయటకు వస్తే చాలు.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. వీరి ఎవరో గుర్తు పట్టారా అంటూ బుర్రకు పదును పెడుతుంటారు కొంతమంది. అటువంటి ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చేస్తుంది. వారికున్న సినిమా క్రేజ్ అలాంటిది.

ప్రస్తుతం సౌత్ ఇండియా సూపర్ స్టార్ కమల్ హాసన్ బాలనటుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు. అనంతరం 20ఏళ్ళ వయస్సులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి, తమిళ, తెలుగు, హిందీ తదితర భాషల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ.. ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. స్టార్ హీరో కమల్ హాసన్ హీరోగా చేసిన ప్రయోగాలు మరే హీరో చేయలేదు అందంలో అతిశయోక్తి లేదు. కమల్ హాసన్ ద్వి పాత్రయంలోనే కాదు.. మరగుజ్జు గా అనేక పాత్రల్లో నటించి అలరించాడు. ఏకంగా దశావతారం మూవీలో ఏకంగా 10విభిన్న పాత్రలతో చరిత్ర సృష్టించాడు.

నాలుగేళ్ల వయస్సులో కళధూర్ కణ్ణమ్మ మూవీలో నటించిన కమల్ హాసన్ మహానటి సావిత్రితో కలిసి నటించాడు. కమల్ హాసన్ నటన చూసి సావిత్రి జెమిని గణేశన్ సైతం ఆశ్చర్యపోయారట. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించాడు. కమల్ హాసన్ అసలు పేరు పార్ధసారధి. పార్ధు అని ముద్దుగా పిలిచేవారట. అప్పట్లోనే కమల్ హాసన్ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. 62ఏళ్ళ వయస్సులో కూడా యంగ్ హీరోలకు ధీటుగా నటిస్తూ అలరిస్తున్న కమల్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు.

Also Read: రజనీకాంత్-లతల ప్రేమవివాహం.. సినిమా స్టోరీని తలపించే ట్విస్టులు..

త్రివర్ణపతాకం పోస్టర్‌లో సోనూ సూద్ ఫోటో.. రియ‌ల్ హీరో ఆఫ్ ఇండియా అంటున్న అభిమాని

భర్త మరో మహిళతో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..! తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

భార్య పేరు మీద ఇల్లు కొనుగోలు చేస్తున్నారా?.. ఆసక్తికర విషయాలు మీకోసమే..