Love story: రజనీకాంత్-లతల ప్రేమవివాహం.. సినిమా స్టోరీని తలపించే ట్విస్టులు

Love story: ప్రేమ పెళ్లిల విషయంలో సామాన్యులైన సెలబ్రెటీలైనా ఒకటే..ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్ల గురించి అభిమానులు ఎంతో ఆసక్తికరంగా తెలుసుకుంటారు. నేటి తరానికి..

Love story: రజనీకాంత్-లతల ప్రేమవివాహం.. సినిమా స్టోరీని తలపించే ట్విస్టులు
Rajanikanth
Follow us
Surya Kala

|

Updated on: Aug 16, 2021 | 11:20 AM

Love story: ప్రేమ పెళ్లిల విషయంలో సామాన్యులైన సెలబ్రెటీలైనా ఒకటే..ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్ల గురించి అభిమానులు ఎంతో ఆసక్తికరంగా తెలుసుకుంటారు. నేటి తరానికి యంగ్ హీరోలు, హీరోయిన్ల ప్రేమ పెళ్లిళ్ల గురించి తెలుసు.. కానీ గత హీరోల ప్రేమ పెళ్లిల గురించి చాలామందికి తెలియదు. అలాంటి లవ్ స్టోరీ నే సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులది.. ఈ విషయం ఎక్కువమందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే రజనీకాంత్ ఫ్యామిలీ వ్యక్తిగత విషయాలను గురించి పెద్దగా వెల్లడించరు. అయితే రజనీకాంత్ లవ్ స్టోరీలో ట్విస్టులు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయట.

రజనీకాంత్ సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత పెళ్లి కాక ముందు లత అనే ఒక కాలేజీ స్టూడెంట్ తమ కళాశాల ప్రచురించే మ్యాగజైన్ కోసం రజనీకాంత్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లారు. అయితే అలా రజనీకాంత్ ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన లత ఎవరో కాదు.. రజనీకాంత్ భార్య లతనే.

డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి సుపరిచితురాలైన వైజి మహేంద్రన్ భార్య చెల్లెలు లత. మహేంద్రన్ రెకమండేషన్ చేయడంతో రజనీకాంత్ ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లారు. కాలేజీ స్టూడెంట్ లతను చూసి రజిని మొదటి చూపులోనే ప్రేమలోపడ్డారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తర్వాత లత రజనికాంత్ కు లత రెండో పాటు కనిపించలేదు.. దీంతో రజనీకాంత్ లత కోసం ఎదురు చూస్తూనే షూటింగ్ లో బిజిబిజీ అయ్యారు. మూడు రోజుల అనంతరం లత కనిపించడంతో లతను చూసి రజనీకాంత్ షాక్ అయ్యారు.

లత తలపై జుట్టు లేకుండా గుండుతో రజనీకాంత్ కు దర్శనమిచ్చింది. దీంతో రజని షాక్ తిన్నారు. ఏమిటి అని అడిగితే లత సమాధానం చెప్పిన విషయం విన్న రజనీకాంత్ ఆశ్చర్యపోయారు. మీరంటే నాకు చాలా ప్రాణం.. మీ మనసు ఎక్కడైనా మారుతుందోనని భయం వేసింది. అందుకే మీ మనసు మారకుండా ఉండాలని తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను. అందుకనే తిరుపతి వెళ్లి తలనీలాలు సమర్పించానని లత చెప్పింది. దీంతో తనపై లతకు ఉన్న ప్రేమ తెలుసుకున్న రజిని మనసు కదిలిపోయింది. కొన్ని రోజుల తర్వాత తిరుమల శ్రీవారి సన్నిధిలోనే రజనీకాంత్ లతల వివాహం జరిగింది. వీరిద్దరి పెళ్లి చేసుకునే సమయానికి లత జుట్టు పూర్తిగా రాలేదు. బాయ్ కట్ లోనే వీరి పెళ్లి జరిగింది. ఆతర్వాత రజనీకాంత్ లత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు.. పిల్లల పెళ్లిళ్లు, మనవలు ఇలా వీరి వైవాహిక జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సంతోషంగా సాగిపోతుంది.

Also Read: ఒకసారి వాడిన వంట నూనెను మళ్ళీ మళ్ళీ వేడి చేసి వాడుతున్నారా.. కలిగే అనర్ధాలు తెలుసా