Reheating Cooking Oil: ఒకసారి వాడిన వంట నూనెను మళ్ళీ మళ్ళీ వేడి చేసి వాడుతున్నారా.. కలిగే అనర్ధాలు తెలుసా
Reheating Cooking Oil: బజ్జి, పూరి, పకోడీ వంటి స్నాక్స్ ను తయారు చేసిన తర్వాత మిగిలిన నూనెలను పదే పదే వేడి చేసి వాడుతుంటారు. నూనెలో వేయించిన వంటకాలను తీసేసి..
Reheating Cooking Oil: బజ్జి, పూరి, పకోడీ వంటి స్నాక్స్ ను తయారు చేసిన తర్వాత మిగిలిన నూనెలను పదే పదే వేడి చేసి వాడుతుంటారు. నూనెలో వేయించిన వంటకాలను తీసేసి.. ఆ నూనెను మళ్ళీ మళ్ళీ ఇతర ఆహారపదార్ధాలు తయారు చేయడానికి వాడుతుంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని.. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వలన తీవ్రమైన ఆరోగ్యాల బారిన పడతామని .. జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరిస్తున్నారు.
వంట నూనెలను పదే పదే వేడి చేయడంవలన విష పదార్థాలు ఏర్పడుతాయి. అవి మన శరీరంలోకి వెళ్లగానే ఫ్రీ ర్యాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇదే విషయాన్నీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పిన ప్రకారం వంట నూనెలను పదే పదే వేడి చేస్తే.. వాటిల్లో ట్రాన్స్ ఫ్యాట్ మూడింతలు పెరుగుతుంది. అప్పుడు ఆ నూనెలను తిరిగి తినే ఆహారపదార్ధాలో వాడడం వలన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఒక్కసారి వేడి చేసిన వంట నూనె ను తిరిగి వేడి చేసి వాడితే శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతుంది. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశాలు కూడా ఉన్నాయని.. అందుకనే ఇంట్లోనే కాదు ఎక్కడా పదే పదే నూనె వేడి చేసి వాడరాదని హెచ్చరిస్తున్నారు. అలా తయారు చేసే బయటి ఆహారాలను తినరాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నూనెలను వాడడం వల్ల బీపీ కూడా పెరుగుతుంది. ఇది గుండె జబ్బులను కలిగిస్తుంది. ఇన్ని అనారోగ్యాలను తెచ్చే వంట నూనెను ఒకసారి వాడి పక్కన పెట్టేయడం మంచిదని అంటున్నారు.
Also Read: స్వాతంత్య్రదినోత్సవ కానుకగాఈ వారం థియేటర్‌లో ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు ఇవే..