Covid-19: కరోనా కళ్ల ద్వారా కూడా శరీరంలోకి ప్రవేశిస్తుందా..? అయితే లక్షణాలు ఏమిటి..?

Covid-19: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ద్వారా ప్రస్తుతం వైరస్‌ అదుపులో ఉంది. అయితే కరోనా..

Covid-19: కరోనా కళ్ల ద్వారా కూడా శరీరంలోకి ప్రవేశిస్తుందా..? అయితే లక్షణాలు ఏమిటి..?
Follow us
Subhash Goud

|

Updated on: Aug 16, 2021 | 10:16 AM

Covid-19: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ద్వారా ప్రస్తుతం వైరస్‌ అదుపులో ఉంది. అయితే కరోనా వ్యాపించినప్పటి నుంచి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వైరస్‌ వ్యాపించడానికి రకరకాల కారణాలను వెల్లడిస్తున్నారు. ఇప్పుడు పరిశోధకులు వెల్లడించిన అంశాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు ముగ్గురు, నోటి ద్వారా వ్యాపిస్తుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వైరస్‌ కళ్ల ద్వారా కూడా వ్యాపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికే ఇలాంటి అనుమానాలు వచ్చినా.. పెద్దగా పట్టించుకోలేదు. కానీ కళ్ల ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తుందని తెలుస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

కళ్ల ద్వారా కూడా వైరస్‌ వ్యాపిస్తుందా..?

వైరస్‌ ప్రధానంగా మూడు విధాలుగా శరీరంలోకి ప్రవేశిస్తుందని ఎయిమ్స్‌ మాజీ వైద్యుడు మృదులా మెహతా తెలిపారు. నోటి ద్వారా, ముక్కు ద్వారా, కళ్ల ద్వారా వ్యాపిస్తుందని అంటున్నారు. తరచూ చేతులతో కళ్లను తాకుతుండటం, కళ్లను నలుచుకోవడం అనేది చాలా మందికి అలవాటు. దీంతో వైరస్‌ కళ్ల నుంచి కూడా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని అంటున్నారు.

లక్షణాలు ఏమిటి..?

ఈ సందర్భంగా వైద్యుడు మృదులా మెహతా మాట్లాడుతూ.. వైరస్‌ కళ్ల నుంచి శరీరంలోకి ప్రవేశించినట్లయితే కళ్లు ఎర్రగా మారడం, కళ్లలో ఏదైనా సమస్య తలెత్తడం లాంటివి జరుగుతాయని పేర్కొన్నారు. కళ్లు రంగు మారడం తదితర లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. వైరస్‌ సోకినట్లయితే కళ్లు పేలిపోయినట్లు కనిస్తాయి. కళ్లలో ఇన్ఫెక్షన్‌ వస్తుంది.

శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఎలా తెలుసుకోవాలి..?

సమతుల్య ఆహారం తీసుకునే ఒక సాధారణ వ్యక్తి నడకలో ఎలాంటి అలసట ఉండదు. తగినంత నిద్ర ఉంటుంది. జ్వరం, అలెర్జీలు ఉండవు. అలాంటి సమయంలో అతనికి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. అందుకే కరోనా కాలంలోనూ కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక సూచనలు, సలహాలు పాటించడం మంచిది.

Curd Weight Loss: పెరుగును ఇలా తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు!

Breathing: శ్వాస రేటు అంటే ఏమిటి..? మనిషి ఒక నిమిషంలో ఎన్ని సార్లు శ్వాస తీసుకుంటాడు..? మరి పిల్లలు..

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!