Curd Weight Loss: పెరుగును ఇలా తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు!

Curd Weight Loss: చాలా మందికి పెరుగు అంటే ఎంతో ఇష్టం. పెరుగు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రతి రోజు ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి ఎంతో మంచిది. వేసవి కాలంలో అయితే..

Curd Weight Loss: పెరుగును ఇలా తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు!
Curd Weight Loss
Follow us

|

Updated on: Aug 15, 2021 | 8:46 PM

Curd Weight Loss: చాలా మందికి పెరుగు అంటే ఎంతో ఇష్టం. పెరుగు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రతి రోజు ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి ఎంతో మంచిది. వేసవి కాలంలో అయితే శరీరాన్ని చల్లబర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కొంత మంది పెరుగులు చక్కెర వేసుకుని తింటుంటారు. వేసవిలో జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. వైద్య నిపుణుల సలహాల ప్రకారం.. పెరుగులో అనేక పోషకాలున్నాయి. అలాగే బరువు తగ్గించుకునేందుకు పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. బరువును తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. రోజువారీగా పెరుగును ఆహారంలో చేర్చకుంటే బరువు తగ్గేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పెరుగు తినడం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఇందులో చాలా ప్రోటీన్లు ఉన్నాయి. పెరుగులో తక్కువ కార్బోహైడ్రేట్స్‌, అధిక ప్రోటీన్స్‌ ఉన్నాయి. ఇందులో ఉండే ప్రోటీన్స్‌ శరీరంలో కొవ్వుని తగ్గిస్తుంది. కండరాలు బలంగా తయారయ్యేలా చేస్తుంది. అంతే కాకుండా బొడ్డు చుట్టు ఉన్న కొవ్వు సైతం తగ్గేలా చేస్తుంది.

జీర్ణక్రియను పెంచుతుంది..

పెరుగు తినడం వల్ల బరువు తగ్గడమే కాకుండా జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. పెరుగులో ప్రోబయోటిక్స్‌ ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగు పర్చడం ద్వారా శరీరానికి తగినంత శక్తినిస్తుంది. ఇందులో తగినన్ని పోషకాలు ఉంటాయి.

పోషకాలు :

పెరుగులో కాల్షియం, విటమిన్‌ బి, బి12, పోటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి ఎంతగానో మేలు జరుగుతుంది. కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే విటమిన్‌ బి12, రైబోఫ్లేవిన్‌లు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. పెరుగులో విటమిన్‌ డి మనకు సహాజ సిద్ధంగా లభిస్తుంది. దీని వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. డిప్రెషన్‌ తగ్గుతుంది.

పెరుగుతో హైబీపీ అదుపులో..

అలాగే పెరుగులో పోటాషియం, మెగ్నిషియం పుష్కలంగా ఉండటం వల్ల హైబీపీ అదుపులో ఉంటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజుకు కనీసం 200 గ్రాముల పెరుగు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలలో వెల్లడైంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ వియన్నా సైంటిస్తులు వెల్లడించారు.

మీరు రోజువారీగా పెరుగును మీ ఆహారంలో ఉపయోగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొన్ని సులభమైన పద్ధతుల గురించి తెలుసుకోండి

► మీరు భోజనం లేదా విందులో ఒక గిన్నె పెరుగు తినవచ్చు. ఇది కాకుండా, దీనిని అల్పాహారం కోసం స్మూతీగా ఉపయోగించవచ్చు.

► మీరు పండ్లు, కూరగాయల రైతా చేయడానికి పెరుగును ఉపయోగించవచ్చు. ఇది కాకుండా, పెరుగును గ్రేవీ చిక్కగా చేయడానికి ఉపయోగించవచ్చు.

► మీరు చక్కెర లేదా సుగంధ ద్రవ్యాలు జోడించడం ద్వారా పెరుగు తినవచ్చు. అయితే, చక్కెరను జోడించడం ద్వారా చక్కెర తినడం వల్ల పెరుగులో కేలరీల పరిమాణం పెరుగుతుంది. రోజూ పెరుగుతో చక్కెర తినడం ఆరోగ్యానికి హానికరం.

► వేసవిలో శరీరాన్ని చల్లగా, హైడ్రేట్ గా ఉంచడానికి, లస్సీ , బటర్ మిల్క్ తాగవచ్చు.

ఇవీ కూడా చదవండి

Breathing: శ్వాస రేటు అంటే ఏమిటి..? మనిషి ఒక నిమిషంలో ఎన్ని సార్లు శ్వాస తీసుకుంటాడు..? మరి పిల్లలు..

Diabetes Patient: మధుమేహం ఉన్నవారు ఈ పదార్థాలు తీసుకుంటే షుగర్‌ అదుపులో ఉంటుంది..!

ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు