Breathing: శ్వాస రేటు అంటే ఏమిటి..? మనిషి ఒక నిమిషంలో ఎన్ని సార్లు శ్వాస తీసుకుంటాడు..? మరి పిల్లలు..

Breathing: గత ఏడాదికిపైగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతో మందిని బలి తీసుకుంది. ఎంతో మంది వ్యాధి బారిన పడి కోలుకున్న తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు..

Breathing: శ్వాస రేటు అంటే ఏమిటి..? మనిషి ఒక నిమిషంలో ఎన్ని సార్లు శ్వాస తీసుకుంటాడు..? మరి పిల్లలు..
Breathing
Follow us
Subhash Goud

|

Updated on: Aug 15, 2021 | 8:08 PM

Breathing: గత ఏడాదికిపైగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతో మందిని బలి తీసుకుంది. ఎంతో మంది వ్యాధి బారిన పడి కోలుకున్న తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. లక్షలాది మంది కోవిడ్‌ బారిన పడి ఆస్పత్రుల్లో నిండిపోయారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. ప్రతి రోజు దేశ వ్యాప్తంగా 40 వేల మంది కరోనా బారిన పడుతున్నారు. మన శరీరంలో వైరస్‌ ప్రవేశించిన తర్వాత శ్వాస కోశ వ్యవస్థపై వైరస్ దాడి చేసి ఎంతో మందిని బలి తీసుకుంటోంది. ఈ వైరస్‌ కారణంగా వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ప్రస్తుతం మానవుని శ్వాస రేటు గురించి తెలుసుకుందాం.

శ్వాస రేటు అంటే ఏమిటి..?

శ్వాస రేటు అంటే మీరు నిమిషంలో ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నారో అని అర్థం. ముఖ్యంగా శ్వాస రేటు అనేది మన శరీరంపై ముఖ్యపాత్ర పోషిస్తుంది. శ్వాస రేటు తగ్గితే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శ్వాసకోశ రేటు తెలుసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులను గుర్తించవచ్చు. చిన్న పిల్లలు, వయోజనుల శ్వాస రేటులో చాలా తేడా ఉంటుంది.

వయోజనుల సాధారణ శ్వాసరేటు ఎలా ఉండాలి:

Healthline.com నివేదిక ప్రకారం.. పెద్దవారి సాధారణ శ్వాసరేటు నిమిషానికి 12 నుంచి 16 వరకు ఉంటుంది. అంటే ఆరోగ్యవంతులైన వయోజనుడు నిమిషంలో 12 నుంచి 16 సార్లు శ్వాస తీసుకుంటాడు. మీ శ్వాస రేటు 12 కన్నా తక్కువ లేదా 16 కంటే ఎక్కువ ఉంటే మీరు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. కానీ మీ శ్వాస రేటులో పెద్ద వ్యత్యాసాన్ని చూసినప్పుడు తప్పకుండా ఆందోళన కలిగించే అంశమని గుర్తించాలి. మీ నాడీ వ్యవస్థలో జరిగే సమస్యలకు సాధారణ శ్వాసరేటు కంటే తక్కువ కారణం కావచ్చు. ఇది కాకుండా పెరుగుతున్న వయసుతో మన శ్వాస రేటు కూడా మారుతూ ఉంటుంది.

నవజాత శిశువు శ్వాస రేటు:

వయోజనుడితో పోలిస్తే చిన్న పిల్లల శ్వాస రేటులో చాలా తేడా ఉంటుంది. పిల్లల శ్వాస రేటు ఎంత ఉంటుందో తెలిస్తే ఆశ్యర్యపోతారు. అప్పుడే పుట్టిన శిశువు నిమిషానికి 30 నుంచి 60 సార్లు శ్వాస తీసుకుంటుంది. ఈ శ్వాస రేటు పుట్టినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు ఉంటుంది. 1 నుంచి 3 సంవత్సరాల పిల్లలు ఒక నిమిషంలో 24 నుంచి 34 సార్లు శ్వాస తీసుకుంటారు. 6 నుంచి 12 సంవత్సరాల పిల్లలు శ్వాస రేటు 18 నుంచి30 మధ్య ఉంటుంది. అలాగే 12 నుంచి 18 సంవత్సరాలున్న పిల్లలు నిమిషంలో 12 నుంచి 16 సార్లు శ్వాస తీసుకుంటారు. పెద్దవారి శ్వాస రేటు కూడా సమానంగా ఉంటుంది. వయసు పెరుగుతున్నకొద్ది ఇది మారుతూ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి

Diabetes Patient: మధుమేహం ఉన్నవారు ఈ పదార్థాలు తీసుకుంటే షుగర్‌ అదుపులో ఉంటుంది..!

Health Insurance: మీరు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేటప్పుడు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి.. లేకపోతే ఇబ్బందే!