AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Insurance: మీరు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేటప్పుడు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి.. లేకపోతే ఇబ్బందే!

Health Insurance: ఒకప్పుడు మనదేశంలో ఆరోగ్య బీమా తీసుకునే వారి శాతం చాలా తక్కువగా ఉండేది. కానీ గతేడాది కరోనా మహమ్మారి కారణంగా బీమా పాలసీలు చేసుకునే వారి సంఖ్య..

Health Insurance: మీరు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేటప్పుడు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి.. లేకపోతే ఇబ్బందే!
Health Insurance
Subhash Goud
|

Updated on: Aug 15, 2021 | 5:48 PM

Share

Health Insurance: ఒకప్పుడు మనదేశంలో ఆరోగ్య బీమా తీసుకునే వారి శాతం చాలా తక్కువగా ఉండేది. కానీ గతేడాది కరోనా మహమ్మారి కారణంగా బీమా పాలసీలు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. గతంతో పోలిస్తే వివిధ రకాల పాలసీలను వినియోగదారులు ఎంచుకుంటున్నారు. అయితే వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులకు ఆరోగ్య బీమా కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే పెరుగుతున్న వైద్య వ్యయ భారం, రోగనిరోధక శక్తి బలహీనపడటం లాంటి మొత్తం కుటుంబంపై ఆర్థిక, భావోద్వేగ ప్రభావాన్ని చూపుతాయి. సీనియర్ సిటిజన్ల కోసం అనేక రకాల ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వీటి నుంచి తక్కువ ప్రీమియంతో వృద్ధాప్యంలో వారి అవసరాలను తీర్చగల సమగ్ర కవరేజీని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పాలసీలే ప్రయోజనకరంగా ఉంటాయి.

క్లెయిమ్ చేసుకోవడానికి, తిరస్కరణలను నివారించడానికి పాటించాల్సిన నియమాలు:

ముందు బీమా పాలసీ తీసుకున్న తర్వాత సంబంధిత పత్రాలను క్షుణ్ణంగా చదవాలి. కొత్త పాలసీ కొనుగోలు చేసే సమయంలో నిబంధనలు, షరతులు, మినహాయింపులను తప్పకుండా పరిశీలించాలి. అలాగే పాలసీ తీసుకునే ముందు పాలసీ ఇచ్చే అధికారిని గానీ, ఏజెంట్‌ను పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవాలి. తక్కువ ప్రీమియం ఉన్న మీ పాలసీ యూసేజీని గణనీయంగా పరిమితం చేసే అవకాశముంటుంది. ఒకవేళ మీరు తక్కువ ప్రీమియం ప్లాన్ ను ఎంచుకున్నట్లయితే క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఫీచర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విస్తృతమైన కవరేజీని ఎంచుకున్నట్లయితే మినహాయింపుల గురించి బీమా కంపెనీని అడగడం మర్చిపోవద్దు.

సమాచారం తప్పు అని తేలితే క్లెయిమ్‌ తిరస్కరణ:

పాలసీదారుడి ఆరోగ్య పరిస్థితి, ఉద్యోగ స్థితి, వయస్సుకు సంబంధించి డాక్యుమెంటేషన్ కచ్చితమైన, కీలకమైన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రీమియం మొత్తాన్ని నిర్ధారించడానికి బీమా సంస్థకు సహాయపడే కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకోవడం మంచిది. ఇచ్చిన సమాచారం తప్పు అని తేలితే క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. అందుకే పాలసీలు చేసేటప్పుడు అన్ని అంశాలను తెలుసుకోవడం మంచిది.

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే..

పాలసీ తీసుకున్న తర్వాత ఆరోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరితే ఆసుపత్రి ఖర్చుల్లో కొంత శాతాన్ని పాలసీదారుడు భరించాల్సి ఉంటుంది. పాలసీని కొనుగోలు చేసే సమయంలో పాలసీదారుడు దీని గురించి స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆమోదించిన క్లెయిమ్ మొత్తంలో ఇది 20 నుంచి 50 శాతం వరకు మారవచ్చు. క్లెయిమ్ చేయడానికి ముందు బీమా కంపెనీతో సంప్రదింపులు జరిపి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

వెయిటింగ్ పీరియడ్

ప్రతి బీమా పాలసీ ప్లాన్‌లో వెయిటింగ్ పీరియడ్ భిన్నంగా ఉంటుంది. కొన్ని లిస్టెడ్ పరిస్థితులకు అనుగుణంగా ఇది 30 రోజుల నుంచి రెండు లేదా మూడు సంవత్సరాల వరకు మారవచ్చు. పాలసీదారుడు వెయిటింగ్ పీరియడ్‌లో క్లెయిమ్‌ను కొనసాగించలేరు. మీ తల్లిదండ్రులు అలాంటి పాలసీ పరిధిలోకి వస్తే కార్పోరేట్ హెల్త్ పాలసీలకు సాధారణంగా వెయిటింగ్ పీరియడ్ ఉండదు. సీనియర్ సిటిజన్లు ఇంతకుముందే ఉన్న రుగ్మతలను కవర్ చేసే నిబంధన ఉన్న ప్రణాళికలను తీసుకొని ఉంటారు. అయితే పాలసీ నిబంధనల ప్రకారం నిర్దిష్ట కాలపరిమితిలో ముందుగా ఉన్న అనారోగ్యాలు, వ్యాధులు, వ్యాధుల క్లెయిమ్ ప్రాతిపదికను చాలా కంపెనీలు తిరస్కరించవచ్చు. ముందుగా ఉన్న అనారోగ్యం కవరేజ్, నిర్దిష్ట వెయిటింగ్ పీరియడ్లను చేర్చడం గురించి మీ బీమా కంపెనీతో చెక్ చేసుకోవాలి. ఉదాహరణకు హెర్నియా వంటి నిర్దిష్ట వ్యాధులకు పాలసీ శాతాన్ని కవర్ చేయవచ్చు. ఓ నిర్దిష్ట వ్యాధికి చికిత్స కోసం వ్యతిరేకంగా క్లెయిమ్ చేయడం కోసం మీరు మీ బీమా సంస్థతో చెక్ చేసుకోవడం మంచిది. కొన్ని పాలసీలకు డిడక్టబుల్స్ ఆప్షనల్‌గా ఉంటాయి. అంటే క్లెయిమ్ సమయంలో పాలసీదారుడు స్వయంగా చెల్లించడానికి అంగీకరించిన మొత్తం, క్లెయిమ్ చేసేటప్పుడు మినహాయించిన మొత్తాన్ని గుర్తుంచుకోవాలి.

ముఖ్యమైన డాక్యుమెంట్లు..

క్లెయిమ్ ప్రక్రియను కొనసాగించడానికి ముందుగా పూర్తి లేదా అసలైన డాక్యుమెంట్లను తీసుకెళ్లాలి. పత్రాలు అసంపూర్తిగా లేదా హాస్పిటల్ అథారిటీ ద్వారా ధ్రువీకరించనట్లయితే అలాంటి సందర్భంలో క్లెయిమ్ తిరస్కరణకు గురవడం ఖాయం. కంపెనీ క్లెయిమ్‌ను ఒప్పుకోవాలంటే, మీ క్లెయిమ్ కు మద్దతు ఇచ్చే సరైన డాక్యుమెంట్లు, రిపోర్టులు ఉండాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

ఇలాంటి చికిత్సల కోసం క్లెయిమ్‌

కొన్ని ఆరోగ్య బీమా పాలసీలు ఇప్పుడు యునాని, హోమియోపతి, ఆయుర్వేదం వంటి ప్రత్యామ్నాయ చికిత్సలను అందిస్తున్నాయి. ఇలాంటి చికిత్సల కోసం క్లెయిమ్ చేయడానికి ముందు మీరు మీ బీమా కంపెనీతో చేక్ చేసుకోవాలి. ఇక పాలసీ తీసుకుంటున్నప్పుడు ఎవరైనా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే అతని ఖర్చులు బీమాలో కవర్‌ అవుతాయో లేదో తెలుసుకోండి. కంపెనీ క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ నిష్పత్తిని తనిఖీ చేయండి. ప్రజల సౌలభ్యం కోసం ఐఆర్‌డీఏఐ వివిధ పాలసీ కంపెనీల క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ నిష్పత్తుల జాబితాను విడుదల చేస్తుంది. 90 శాతం కంటే ఎక్కువ క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ రేషియో ఉన్న కంపెనీల నుంచి పాలసీ తీసుకోవాలి. అలాగే కంపెనీ సమయానికి చెల్లిస్తుందో లేదో కూడా తనిఖీ చేయండి.

ఇవీ కూడా చదవండి: Voter ID Address Change: మీ ఓటర్‌ ఐడీ కార్డులో అడ్రస్‌ తప్పుగా ఉందా..? అయితే మార్చుకోండిలా..!

LIC: కస్టమర్లు అలర్ట్‌.. మీరు ఎల్‌ఐసీ పాలసీని తీసుకున్నారా.? అయితే ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి..!

Bank FD: ఈ బ్యాంకు మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక శాతం వడ్డీ.. ఆగస్టు 16 వరకు అవకాశం..!

RBI News: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. బ్యాంకు లైసెన్స్‌లు రద్దు.. ఆ మూడు బ్యాంకులకు భారీ జరిమానా