Gold Price in 1947: మనకి స్వాతంత్య్రం వచ్చేనాటికి బంగారం, వెండి ధరలు ఎంతుండేవో తెలిస్తే వామ్మో అంటారు..

మన దేశంలో ఏదైనా శుభ సందర్భం లేదా పండుగలో బంగారం కొనడం ట్రెండ్. అంతే కాదు, ఇప్పుడు ప్రజలు బంగారంపై కూడా పెట్టుబడులు పెడుతున్నారు.  బంగారంపై మక్కువ ఈనాటిది కాదు.

Gold Price in 1947: మనకి స్వాతంత్య్రం వచ్చేనాటికి బంగారం, వెండి ధరలు ఎంతుండేవో తెలిస్తే వామ్మో అంటారు..
Gold Price In 1947
Follow us
KVD Varma

|

Updated on: Aug 15, 2021 | 4:54 PM

Gold Price in 1947: మన దేశంలో ఏదైనా శుభ సందర్భం లేదా పండుగలో బంగారం కొనడం ట్రెండ్. అంతే కాదు, ఇప్పుడు ప్రజలు బంగారంపై కూడా పెట్టుబడులు పెడుతున్నారు.  బంగారంపై మక్కువ ఈనాటిది కాదు. మన పూర్వీకుల నుంచీ ఉంది. మనదేశంలో బంగారానికి ఆధ్యాత్మికంగానూ చాలా ప్రాధాన్యత ఉంది.  ఈరోజు  దేశంలో 75 వ స్వాతంత్య్ర  దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్రం వచ్చేసరికి బంగారం ధరలు మన దేశంలో ఎలా ఉన్నాయో పరిశీలిస్తే మతిపోవడం ఖాయం. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు మారిన మాట వాస్తవమే అయినా.. బంగారం ధరలు మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకున్నాయో తెలుసుకుంటే ఆమ్మో అనిపిస్తుంది.

గత 75 సంవత్సరాలలో బంగారం, వెండి చాలా ఖరీదైనవిగా మారాయి. 1947 లో బంగారం 10 గ్రాములకు రూ. 88.62 .వెండి కిలో రూ. 107 వద్ద ఉండేది.

ఏకంగా 527 రేట్లు పెరిగిన బంగారం ధరలు..

1947 లో దేశం స్వతంత్రం అయ్యే వరకు, బంగారం 10 గ్రాములకు రూ. 88.62 గా ఉంది, అది ఇప్పుడు 47 వేలకు చేరుకుంది. అంటే, అప్పటి నుండి బంగారం  527 రెట్లు ఖరీదైనదిగా మారింది.. అంటే 52709% పెరుగుదలను నమోదు చేసింది. ఇక వెండి గురించి చొస్తే కనుక.. వెండి 584 రెట్లు ఎగసింది.  స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఇది 584 రెట్లు ఎక్కువ ఖరీదైనదిగా మారింది. 1947 లో, వెండి ధర కిలోకు రూ. 107 గా ఉంది, ఇప్పుడు అది రూ. 62600 వద్ద ఉంది.

మరింత పైకి చేరుకోనున్న బంగారం..వెండి ధరలు..

రాబోయే సంవత్సరంలో, బంగారం 60 వేల వరకు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని తిరిగి పొందడానికి సమయం పడుతుందని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ అండ్ కరెన్సీ) అనూజ్ గుప్తా చెప్పారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడకపోతే, బంగారం అత్యధిక రాబడులను ఇస్తూనే ఉంటుంది. దీని కారణంగా, రాబోయే సంవత్సరంలో బంగారం 60 వేలకు మించి ఉంటుందని ఆయన అంటున్నారు.

ప్రతి సంవత్సరం 800 టన్నుల బంగారం..

ఇండియా ప్రతి సంవత్సరం 700-800 టన్నుల బంగారాన్ని వినియోగిస్తుంది. అందులో 1 టన్ను భారతదేశంలో ఉత్పత్తి అవుతోంది.  మిగిలిన బంగారం దిగుమతి అవుతోంది.  దేశంలో బంగారం దిగుమతి 2020 లో 344.2 టన్నులు, ఇది గత సంవత్సరం కంటే 47% తక్కువ. 2019 లో ఇది 646.8 టన్నులుగా ఉంది.

Also Read: Kingfisher House: అమ్ముడుపోయిన విజయ్ మాల్యా ఖరీదైన భవనం.. దక్కించుకున్న హైదరాబాదీ సంస్థ..

Realme Laptop: మీ ల్యాప్‌టాప్‌లను బద్దలు కొట్టండని చెబుతోన్న రియల్‌మీ.. సరికొత్త ప్రచారానికి తెర తీసిన టెక్‌ దిగ్గజం.