Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kingfisher House: అమ్ముడుపోయిన విజయ్ మాల్యా ఖరీదైన భవనం.. దక్కించుకున్న హైదరాబాదీ సంస్థ..

Vijay Mallya: ఆర్థిక నేరగాడు.. వ్యాపార వేత్త విజయ్ మాల్యాకు చెందిన ఖరీదైన విలాసవంతమైన బిల్డింగ్ వేలంపాటలో అమ్ముడుపోయింది. దేశీ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టి.. దేశం నుంచి ఉడాయించిన

Kingfisher House: అమ్ముడుపోయిన విజయ్ మాల్యా ఖరీదైన భవనం.. దక్కించుకున్న హైదరాబాదీ సంస్థ..
Kingfisher House
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 15, 2021 | 9:44 AM

ఆర్థిక నేరగాడు.. వ్యాపార వేత్త విజయ్ మాల్యాకు చెందిన ఖరీదైన విలాసవంతమైన బిల్డింగ్ వేలంపాటలో అమ్ముడుపోయింది. దేశీ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టి.. దేశం నుంచి ఉడాయించిన విజయ్ మాల్యాకు చెందిన ఆస్తులను వేలం వేసి రికవరీ చేసేందుకు బ్యాంకులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ముంబైలోని విలాసవంతమైన భవనం వేయగా హైదరాబాద్‌కు చెందిన శాటర్న్ రియల్టర్ కంపెనీ అనే సంస్థ ఈ భవనాన్ని కొనుగోలు చేసింది. ముంబైలోని విలే పార్లేలో ఉన్న కింగ్‌ఫిషర్‌ను హౌస్‌ను డెట్‌ రికవరీ ట్రైబ్యునల్‌ (DRT) వేలం వేయగా సాటర్న్‌ రియల్టర్స్‌ రూ.52.25 కోట్లకు దక్కించుకుంది.

ఈ భవనాన్ని విక్రయించేందుకు DRT, బెంగళూరు కార్యాలయం ఎనిమిది సార్లు ప్రయత్నించి విఫలమైంది. ఎట్టకేలకు తొమ్మిదో సారి విక్రయించింది. అయితే.. ఇంత పెద్ద మొత్తం లో ధర పెట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో ఈ ధర భారీగా తగ్గించింది. కేవలం  రూ.52.25 కోట్లకు హైదరాబాద్‌కు చెందిన శాటర్న్ రియల్టర్ కంపెనీ దక్కించుకుంది.

ఎయిర్‌లైన్స్‌కు హెడ్ క్వార్టర్స్‌గా..

ముంబైలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు హెడ్ క్వార్టర్స్‌గా ఈ విలాసవంతమైన బిల్డింగ్ ఉండేది. 2012 అక్టోబరు నుంచి కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కాగా గత నెల 31న మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.2.612 కోట్ల స్టాంప్‌ డ్యూటీ చెల్లించటం ద్వారా ఈ హౌస్‌ను సాటర్న్‌ రియల్టర్స్‌ హస్తగతం చేసుకుంది. ఈ బిల్డింగ్ నవ్‌పాడా విల్లేపార్లె ఈస్ట్ ప్రాంతంలో ఉందీ. శాంతాక్రజ్‌లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండటం విశేషం. ఇందులోనుంచే కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కార్యకలాపాలు సాగేవి.

ఈ భవనం బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్, అప్పర్ ఫ్లోర్‌లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు కొనసాగేవి. అత్యంత ప్రైం లొకేషన్ లో ఉన్నటువంటి ఈ భవన సముదాయానికి మంచి డిమాండ్ ఉంది. కాగా ఈ భవనం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరు మీద దీన్ని రిజిస్టర్ చేయబడి ఉంది. అంతేకాదు దీని మార్కెట్ విలువ సుమారు రూ. 150 కోట్లు  ఉంది. అమ్ముడు పోయింది మాత్రం రూ.52.25 కోట్లకు మాత్రమే కావడం విశేషం.

ఇవి కూడా చదవండి: Jio: 365 రోజుల పాటు రోజుకు 3GB డేటా, అపరిమిత కాలింగ్.. SMS పూర్తిగా ఫ్రీ.. ఈ జియో ప్లాన్‌లో మరిన్ని ప్రయోజనాలు..

Independence Day 2021 Live: దేశ విభజన గాయం నేటికీ వెంటాడుతోంది.. ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ