EPF : పీఎఫ్ ఖాతాదారులకు గమనిక..! ఈ 6 పరిస్థితులలో డబ్బు విత్ డ్రా చేయాలంటే కచ్చితంగా ఇది అవసరం..
EPF : మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు అవసరం రీత్యా PF డబ్బును క్లెయిమ్ చేయాలనుకుంటే కచ్చితంగా EPF ఫారం 31 గురించి తెలుసుకోవాలి.
EPF : మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు అవసరం రీత్యా PF డబ్బును క్లెయిమ్ చేయాలనుకుంటే కచ్చితంగా EPF ఫారం 31 గురించి తెలుసుకోవాలి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక సంస్థ. ఈ సంస్థ ద్వారా ఉద్యోగులు రిటైర్మెంట్ ఫండ్ కోసం డబ్బులు జమ చేస్తారు. వారి జీతంలో కొంత భాగాన్ని తీసి EPF లో జమ చేస్తారు.
అయితే EPF ఉద్యోగ సమయంలో డబ్బు ఉపసంహరించుకోవడానికి అనుమతించదు. కానీ కొన్ని పరిస్థితులలో దీనికి మినహాయించారు. అందుకోసం ఉద్యోగి ఫారం 31 ని కచ్చితంగా సబ్‌మిట్ చేయాలి. దీని ద్వారా EPF పూర్తి లేదా సగం వరకు డబ్బు విత్ డ్రా చేయవచ్చు. మీరు ఉద్యోగం నుంచి రిటైర్ అయినప్పుడు మాత్రమే మొత్తం డబ్బును విత్‌డ్రా చేయవచ్చు. ఒక ఉద్యోగి వరుసగా 2 నెలలు ఉద్యోగం లేకుండా ఉన్నప్పుడు కూడా పూర్తిగా డబ్బు విత్‌డ్రా చేసుకునే నిబంధన ఉంది.
1. పిల్లల చదువు.. ఇపిఎఫ్ డబ్బును ముందుగానే విత్ డ్రా చేసుకునేందుకు 6 పరిస్థితులు కల్పించింది. అందులో మొదటిది పిల్లల చదువు. ఉద్యోగి ఫారం 31 ని సబ్‌మిట్ చేసి 50 శాతం డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం 7 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. మీ పిల్లల చదువు కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తే మాత్రమే ఈ డబ్బును విత్ డ్రా చేయవచ్చు.
2. వివాహం.. ఇందుకోసం మొత్తం EPF ఫండ్‌లో 50% ఉపసంహరించుకోవచ్చు. దీని కోసం ఉద్యోగం 7 సంవత్సరాలు పూర్తి చేయాలి. ఈ డబ్బును సొంత వివాహం, సోదరుడు-సోదరి లేదా కుమార్తె-కుమారుడి వివాహం కోసం విత్ డ్రా చేసుకోవచ్చు.
3. భూమి కొనడానికి ఇల్లు కట్టుకోవడానికి మూడవ పరిస్థితి భూమి కొనడానికి లేదా ఇల్లు కట్టుకోవడానికి డబ్బు అవసరం. మీరు భూమిని కొనుగోలు చేయాలనుకుంటే మీరు నెలవారీ వేతనానికి 24 రెట్లు EPF నుంచి DR ఉపసంహరించుకోవచ్చు. మీరు ఇల్లు కొనడానికి జీతం కంటే 36 రెట్లు డబ్బు విత్‌డ్రా చేయవచ్చు. దీని కోసం 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయాలి. కొనుగోలు చేయబోయే ఇల్లు లేదా భూమి అతని పేరు మీద లేదా జీవిత భాగస్వామితో కలిసి ఉండాలి.
4. ఇంటి మరమ్మతు కోసం ఇంటి మరమ్మతు కోసం ఉద్యోగి తన నెలవారీ జీతం కంటే 12 రెట్లు డబ్బు విత్‌డ్రా చేయవచ్చు. దీని కోసం ఉద్యోగం 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయాలి. మరమ్మతులు చేయాల్సిన ఇల్లు తన పేరు మీద లేదా అతని భార్య పేరు మీద లేదా ఉమ్మడి పేరు మీద ఉండాలి.
5. గృహ రుణ చెల్లింపు గృహ రుణ చెల్లింపునకు ఉద్యోగి తన సహకారంలో 90 శాతం అంతేకాకుండా కంపెనీ సహకారాన్ని కూడా తీసుకోవచ్చు. దీని కోసం ఒక సంవత్సరం ఉద్యోగం పూర్తి చేయాలి. తీసుకున్న ఇల్లు సొంత, భార్య లేదా ఉమ్మడి పేరుతో ఉండాలి. కొన్ని పత్రాలను EPFO కి సమర్పించాలి.
6. రిటైర్మెంట్ ముందు రిటైర్మెంట్ ముందు ఒక ఉద్యోగి మొత్తం ఫండ్‌లో 90 శాతం వడ్డీతో విత్‌డ్రా చేయవచ్చు. ఉద్యోగి వయస్సు 57 సంవత్సరాలు నిండినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మీ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఈ ఉపసంహరణ జరుగుతుంది. ఈ పనులన్నింటికీ ఫారం 31 ని పూరించడం అవసరం.