Fact Check: ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించినందుకు కేంద్రం ప్రజలకు ఉచితంగా ఏడాది పాటు మొబైల్ రీఛార్జ్.. నిజమెంత?
Fact Check: టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు అద్భతంగా ప్రదర్శించారు. ఒక బంగారు పతకం, 2 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించుకున్న భారత్.. ఒలింపిక్స్‌లో అత్యుత్తమ..
Fact Check: టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు అద్భతంగా ప్రదర్శించారు. ఒక బంగారు పతకం, 2 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు సాధించుకున్న భారత్.. ఒలింపిక్స్‌లో అత్యుత్తమ విజయాన్ని కైవసం చేసుకుంది. జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించగా, కుస్తీలో రవి దహియా రజతం, వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయ్ చాను వెండి పతకం, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు కాంస్యం, కుస్తీలో బజరంగ్ పునియా కాంస్యం, బాక్సింగ్‌లో లోవ్లినా కాంస్యం, అలాగే భారత పురుషుల హాకీ జట్టు కూడా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో భారత్ పతకాలు సాధించడంతో దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. దీంతో సంబరాలు జరుపుకొన్నారు ప్రజలు. అలాగే ఈ రోజు భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆటగాళ్లందరినీ ఎర్రకోటకు ఆహ్వానించి సత్కరించారు.
నీరజ్ చోప్రా విజయంతో ఉచిత రీఛార్జీ వార్త నిజమైనదా..?
అయితే భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి సహా ప్రముఖ నాయకులందరూ ఒలింపిక్స్ పతక విజేతలను అభినందించారు. ఇక నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించిన తర్వాత దేశమంతా పండగ వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోయే అవకాశం ఉంది. ఇటీవల ఓ వార్త వాట్సాప్ గ్రూపు, ఇతర సోషల్ మీడియాలో ఓ సందేశం వైరల్ అవుతోంది. అదేంటంటే.. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించిన ఆనందంలో భారత ప్రభుత్వం దేశంలోని పౌరులందరికీ ఉచితంగా ఒక సంవత్సరం పాటు రీఛార్జ్ చేయనుందనే పోస్టు వైరల్ అవుతోంది. రూ.2399 ఉచితంగా రీఛార్జ్ చేయిస్తుందని ఈ పోస్టు సారాంశం. అలాగే ఉచిత రీఛార్జ్ చేసుకోవాలంటే పోస్టులో ఉన్న లింక్‌పై క్లిక్ చేసి టెలికాం ఆపరేటర్ పేరు, రాష్ట్రం పేరు, మొబైల్ నెంబర్ నమోదు చేసి సంవత్సరం పాటు ఉచిత రీఛార్జ్ పొందాలని ఈ పోస్టు వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న పోస్టుపై స్పందించిన పీఐబీ ప్యాక్ట్ చెక్
వాట్సాప్ గ్రూపుల్లో, ఇతర సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఈ పోస్టు నకిలీదని తేల్చింది. ఉచిత రీఛార్జ్ అంటూ వైరల్ అవుతున్న పోస్టును ఎవ్వరు కూడా నమ్మవద్దని, అది నకిలీదని తేల్చి చెప్పింది. ఈ పోస్టులో ఉన్న లింక్‌లను ఓపెన్ చేసి వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించింది. మిమ్మల్ని మోసం చేసేందుకే ఇలాంటి పోస్టులు వైరల్ అవుతున్నాయని తెలిపింది.
दावा: #Olympics2021 में स्वर्ण पदक मिलने की खुशी में भारत सरकार सभी को 12 महीने फ्री रिचार्ज का अवसर दे रही है#PIBFactCheck
▶️ यह दावा फर्जी है।
▶️भारत सरकार ने फ्री रिचार्ज के बारे में ऐसी कोई घोषणा नहीं की है।
▶️कृपया ऐसे किसी भी फर्जी लिंक पर अपनी निजी जानकारी साझा न करे। pic.twitter.com/a9KDFX00uV
— PIB Fact Check (@PIBFactCheck) August 13, 2021