పార్టీ కార్యాలయంలోనే పడక.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సిద్దు ఏం చేశారంటే ..?
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దు తన హామీని నిలబెట్టుకున్నారు. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చండీగడ్ లోని పార్టీ ఆఫీసులో బెడ్ ను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. పగలు, రాత్రి కూడా ఇక్కడే ఉంటానని, కార్యకర్తల సమస్యలు తీర్చేందుకు

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దు తన హామీని నిలబెట్టుకున్నారు. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చండీగడ్ లోని పార్టీ ఆఫీసులో బెడ్ ను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. పగలు, రాత్రి కూడా ఇక్కడే ఉంటానని, కార్యకర్తల సమస్యలు తీర్చేందుకు యత్నిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 15 నుంచి ఇక్కడే బెడ్ ఏర్పాటు చేసుకుంటానని ఆయన ఇదివరకే ప్రకటించారు. మంత్రులు కూడా కనీసం మూడు గంటలు ఇక్కడ ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. పార్టీ ఆఫీసులో ఈ బెడ్ యవ్వారానికి సంబంధించిన ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా సిద్దు, సీఎం అమరేందర్ సింగ్ మధ్య విభేదాలు తిరిగి పెద్దదవుతున్నాయి. రాష్ట్రంలో డ్రగ్స్ కేసులతో సంబంధం ఉన్నవారిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని సిద్దు ఆరోపిస్తున్నారు. 2018 లోనే ఈ కేసులు వెలుగులోకి వచ్చినా వారిపై ఏ చర్య తీసుకున్నారో తెలియడంలేదని, పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ రిపోర్టులు బయట పెట్టకపోతే తానే అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశ పెడతానని ఆయన హెచ్చరించారు.
దీంతో అమరేందర్ సింగ్ మళ్ళీ ఢిల్లీ బాట పట్టారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసి ..సిద్దు వ్యవహార శైలిపై ఆమెకు ఫిర్యాదు చేశారు. హోం మంత్రి అమిత్ షాను కూడా ఆయన కలిశారు. అయితే అమృత్ సర్ శివార్లలోని ఓ గ్రామంలో పోలీసులు కనుగొన్న ఓ టిఫిన్ బాక్స్ బాంబు విషయాన్నీ ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గా తన ప్రమాణ స్వీకారానికి సిద్దు ఆహ్వానించడం, దానికి అమరేందర్ సింగ్ హాజరవడం చూసినవారంతా వీరి మధ్య విభేదాలు సమసిపోయినట్టేనని భావించారు. కానీ సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది.
మరిన్ని ఇక్కడ చూడండి : బాయ్‌ఫ్రెండ్ కోసం..జుట్లు పీక్కుని కొట్టుకున్న అమ్మాయిలు..!ట్రెండ్ అవుతున్న వీడియో: Girls Hit For a Boyfriend Video.
జోకర్ దొంగ..పోలీసులకే ఛాలెంజ్..!హాలీవుడ్ తరహాలో ఏటీఏం చోరీ వైరల్ వీడియో..:Joker Thief Video.