భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవం..జాతీయ గీతం ‘జనగణమన’పై ఆ ఇరానీ గర్ల్ అభిమానం చూడాల్సిందే !
భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇరాన్ కు చెందిన ఓ 13 ఏళ్ళ అమ్మాయి మన జాతీయ గీతంపై చూపిన అభిమానం ఆశ్చర్యం కలిగించక మానదు. 'జనగణమన' గీతాన్ని ఆమె సంతూర్ వాద్య పరికరంపై అద్భుతంగా వాయించిన వైనం వీడియోకెక్కి రంజింప జేస్తోంది.

భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇరాన్ కు చెందిన ఓ 13 ఏళ్ళ అమ్మాయి మన జాతీయ గీతంపై చూపిన అభిమానం ఆశ్చర్యం కలిగించక మానదు. ‘జనగణమన’ గీతాన్ని ఆమె సంతూర్ వాద్య పరికరంపై అద్భుతంగా వాయించిన వైనం వీడియోకెక్కి రంజింప జేస్తోంది. మొదట ‘నమస్కార్…విషింగ్ మై ఇండియన్ ఫ్రెండ్స్ ఏ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే..విత్ బెస్ట్ రిగార్డ్స్ ఫ్రమ్ ఇరాన్’ అని…వెంటనే సంతూర్ పై ఈ జాతీయ గీతాన్ని వినిపించింది. తారా గాహ్రేమని అనే ఈ చిన్నారి ప్రతిభను గ్లోబల్ చైల్డ్ ప్రాడెజీ అవార్డ్స్ సంస్థ వెలుగులోకి తెచ్చింది. ఇరాన్ లోని భారత రాయబార కార్యాలయం కూడా ఈమె టాలెంట్ ని తన ట్విటర్ లో వీడియో రూపంలో షేర్ చేసింది.తారా సృజనాత్మకతను, ఆమె ప్రతిభను సోషల్ మీడియాలో ప్రశంసించని వాళ్ళు లేరు.
2020 సంవత్సరానికి గానుఈమె గ్లోబల్ చైల్డ్ ప్రాడెజీ అవార్డు సాధించింది. కళలకు ఎల్లలు, జాతులు. దేశాలు ఏవీ హద్దులు కావని తారా నిరూపించింది. ఇండియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram
Young Iranian artist, Tara Ghahremani gives soulful santoor rendition of ?? National Anthem, on the eve of 75th Independence Day #AmritMahotsav #IndiaAt75 @AmritMahotsav @MEAIndia @iccr_hq pic.twitter.com/YwrnnkbOBL
— India in Iran (@India_in_Iran) August 14, 2021
మరిన్ని ఇక్కడ చూడండి : బాయ్‌ఫ్రెండ్ కోసం..జుట్లు పీక్కుని కొట్టుకున్న అమ్మాయిలు..!ట్రెండ్ అవుతున్న వీడియో: Girls Hit For a Boyfriend Video.
జోకర్ దొంగ..పోలీసులకే ఛాలెంజ్..!హాలీవుడ్ తరహాలో ఏటీఏం చోరీ వైరల్ వీడియో..:Joker Thief Video.