- Telugu News Photo Gallery Technology photos Ola Electric Scooter Launched today 15th August 2021 Know all about Ola Scooter Factory which is the Largest Two Wheeler Manufacturing Factory in the world
Ola Scooter Factory: ఓలా స్కూటర్ ఫ్యాక్టరీలో రోజుకు ఎన్ని స్కూటర్లు తయారవుతాయి తెలిస్తే ఆశ్చర్యపోతారు..
ఈరోజు (ఆగస్టు 15, 2021) ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేశారు. ఎన్నాళ్లగానో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలను..ఆసక్తిని నిలుపుకుంటూ ఓలా స్కూటర్ అధునాతన ఫీచర్లతో ముందుకు వచ్చింది.
Updated on: Aug 15, 2021 | 5:36 PM

ఈరోజు (ఆగస్టు 15, 2021) ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేశారు. ఎన్నాళ్లగానో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలను..ఆసక్తిని నిలుపుకుంటూ ఓలా స్కూటర్ అధునాతన ఫీచర్లతో ముందుకు వచ్చింది. ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడంతో అందరి దృష్టీ ఇప్పుడు ఈ స్కూటర్ ఎక్కడ తయారు అవుతుంది? ఎలా తయారవుతుంది అనే విషయాలపై పడింది.

ఓలా స్కూటర్ కంపెనీ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. దీనిని తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాక్టరీకోసం 2400 కోట్లు ఖర్చు అయ్యాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కర్మాగారమని ఓలా పేర్కొంది. స్కూటర్‌లో ఉపయోగించే బ్యాటరీతో సహా 90% ద్విచక్ర వాహన భాగాలు ఇక్కడే తయారు అవుతాయి.

ఇక ఈ ఓలా మెగా బ్లాక్ గురించి చెప్పుకుంటే అది 43 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇది ఢిల్లీ విమానాశ్రయం T3 టెర్మినల్ 20 ఎకరాల కంటే ఎక్కువ, అదేవిధంగా ముంబై విమానాశ్రయం T2 టెర్మినల్ 24 ఎకరాలు మరియు బెంగళూరు విమానాశ్రయ టెర్మినల్ 26 ఎకరాలు. దీనిని బట్టి ఓలా మెగా బ్లాక్ ఎంత ఉంటుందో ఊహించవచ్చు.

ఓలా ఫ్యాక్టరీలో ప్రతి 2 సెకన్లకు 1 స్కూటర్‌ను తయారు చేస్తుంది. అలాగే ఒక రోజులో 25000 మోటార్లు ఇన్‌స్టాల్ చేయగల సామర్ధ్యం దీనికి ఉంది. ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే.. మూడు వేల రోబోలు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో అలా స్కూటర్లను రూపొందించడంలో ఉపయోగపడతాయి.

రోబోల లెక్క పక్కన పెడితే.. ఈ కంపెనీ 10 వేల ఉద్యోగాలను సృష్టిస్తుందని కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ చెప్పారు.

ఇక ఓలా ఇ-స్కూటర్ కస్టమర్‌ల కోసం హైపర్‌ఛార్జర్ నెట్‌వర్క్‌ను కూడా రూపొందిస్తున్నారు. ఇది వినియోగదారులకు హై స్పీడ్ ఛార్జింగ్ పరిష్కారాలను అందిస్తుంది. హైపర్‌ఛార్జర్ నెట్‌వర్క్ ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల కోసం విస్తరిస్తారు. భవిష్యత్తులో ఓలా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని కూడా ఇక్కడ ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.





























