Narender Vaitla |
Updated on: Aug 15, 2021 | 11:51 AM
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీకి చెందిన రెడ్‌మీ సిరీస్ భారత్‌లో ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
రెడ్‌మీ సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు వచ్చిన ఫోన్‌లను మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా రెడ్‌మీ 10 మోడల్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.
నిజానికి ఈ ఫోన్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా రెడ్‌మీ 10కి సంబంధించిన కొన్ని ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.
ఈ ఫోన్‌లో హోల్ పంచ్ డిస్‌ప్లే, క్వాడ్ రేర్ కెమెరాలతో పాటు లేటెస్ట్ ఎంఐయూఐ ఎక్స్‌పీరియన్స్ తీసుకురానున్నారు. ఈ ఫోన్‌ను 4జీబీ + 64 జీబీ, 4 జీబీ + 128 జీబీ, 6 జీబీ + 128 జీబీ వెర్షన్‌లలో ఉండనుంది.
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడవనున్న ఈ ఫోన్‌లో 6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్‌ను తీసుకురానున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 8,999గా ఉండొచ్చని అంచనా.
కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.