- Telugu News Photo Gallery Technology photos Xiaomi revealed its latest Gadget Cyber Dog the Robot Dog its features and price
Cyber Dog: రోబో కుక్క..షియోమీ కంపెనీ అద్భుత సృష్టి..ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా?
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అద్భుతాలు సృష్టిస్తోంది. దీనిని అందిపుచ్చుకుని కంపెనీలు వేగంగా పలురకాల ఉత్పత్తులు సృష్టిస్తున్నారు. ప్రముఖ మొబైల్ కంపెనీ.. రోబో కుక్కను సృష్టించింది. ఆ రోబో కుక్క విశేషాలు ఏమిటో చూసేయండి మరి..
Updated on: Aug 14, 2021 | 3:50 PM

ప్రపంచంలోని టాప్ మొబైల్ కంపెనీ సరికొత్త గాడ్జెట్ తో వచ్చింది. ఇది రోబో డాగ్. షియోమీ సైబర్ డాగ్ పేరుతొ ఈ సరికొత్త రోబో డాగ్ ను తీసుకువచ్చింది. అయితే, వీటి ఉత్పత్తిని మాత్రం చాలా తక్కువగా చేస్తున్నట్టు కంపెనీ చెప్పింది. ఈ సైబర్ డాగ్ మూడు కిలోగ్రాముల బరువు ఉంటుంది. ఇది సెకనుకు 3.2 మీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది ఎన్విడియా కి చెందిన జెట్సన్ జేవియర్ AI ప్లాట్‌ఫారమ్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది.

ఈ సైబర్ డాగ్ కు కెమెరా, అల్ట్రా-వైడ్ యాంగిల్ ఫిషయ్ లెన్స్, సెన్సార్లు, GPS మాడ్యూల్, ఇంటెల్ రియల్‌సెన్స్ D450 డెప్త్ సెన్సింగ్ కెమెరా అమర్చారు. దీని కారణంగా ఇది దాని పరిసరాలను పూర్తిగా పరిశీలించి, తదనుగుణంగా ప్రతిస్పందిస్తుంది

షియోమి ఇచ్చిన సమాచారం ప్రకారం, కంపెనీ తన మొదటి రోబోకు అనేక ఫీచర్లను జోడించింది. ఇది వాయిస్ ఆదేశాలను అనుసరిస్తుంది. దాని చుట్టూ ఉన్న విషయాలను గమనిస్తుంది. అలాగే విశ్లేషిస్తుంది కూడా. సైబర్‌డాగ్ దాని పరిసరాల నావిగేషన్ మ్యాప్‌ను సృష్టించగల సహాయంతో బహుళ కెమెరాలను కలిగి ఉంది, దీనివలన దాని మార్గంలో అడ్డంకులను నివారించే అవకాశం దానికి కలుగుతుంది.

సైబర్ డాగ్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. దాని కారణంగా అది దాని ఓనర్‌ను గుర్తించగలదు. ఇది సాధారణ కుక్కలా కాపలా ఉండే విధంగా రోపొందించారు. ఈ రోబో డాగ్‌లోని గొప్పదనం ఏమిటంటే అది ఒక అందమైన కుక్కలా కనిపించడం. ఇది మామూలు కుక్కలా కరవడం మాత్రం చేయలేదు!

మీకు ఈ అందమైన.. కుక్క కావాలంటే కొద్దికాలం ఆగాల్సి రావచ్చు. ప్రస్తుతం షియోమీ 1000 1000 యూనిట్లు మాత్రమే తయారు చేస్తోంది. ఇవి షియోమీ అభిమానులు, ఇంజనీర్లు, రోబోటిక్స్ పై ఆసక్తి ఉన్నవారికి మాత్రమే ఇస్తామని కంపెనీ చెప్పింది. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసా? చైనా కరెన్సీలో 9.999 యువాన్లు. అంటే మన కరెన్సీలో దాదాపుగా 1.15 లక్షలు ఉంటుంది.





























