- Telugu News Photo Gallery Technology photos Reliance Jio Release JIO Next Phone On September 10th Have A Look On Leaked Features
JIO Phone Next: జియో మరో సంచలనం.. రూ. 4 వేలకే స్మార్ట్ ఫోన్. ఎప్పటి నుంచి అందుబాటులోకి రానున్నాయంటే.
JIO Phone Next: టెలికాం రంగంలో ఓ పెను సంచలనంలా దూసుకొచ్చిన జియో తాజాగా మరో అద్భుతానికి తెర తీస్తోంది. తొలిసారిగా అత్యంత తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. జియో నెక్ట్స్ పేరుతో రానున్న ఈ ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది.
Updated on: Aug 14, 2021 | 6:55 AM

టెలికాం రంగంలో ఎన్నో అద్భుతాలకు తెర తీస్తోన్న రిలయ్సన్ జియో తాజాగా మరో సంచలనానికి తెర తీస్తోంది.

ఇప్పటికే ఇంటర్‌నెట్ ఛార్జీలను గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా తగ్గించిన జియో.. తాజాగా అత్యంత తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. జియో నెక్ట్స్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకురానున్నట్లు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

రూ. 4 వేలకే 4జీ నెట్‌వర్క్ సపోర్ట్ చేసే ఈ ఫోన్‌ను జియో వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న మార్కెట్లోకి తీసుకురానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లను ఎక్స్ డిఎ డెవలపర్స్ లో ఎడిటర్ ఇన్ చీఫ్ అయిన మిషాల్ రెహమాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీటి ప్రకారం దీని ప్కారం ఈ స్మార్ట్ ఫోన్ నెక్ట్స్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడవనుంది.

ఈ స్మార్ట్ ఫోన్ 720ఎక్స్1,440 పిక్సెల్స్ డిస్ ప్లేను కలిగి ఉండనుంది. క్వాల్కామ్ క్యూఎమ్215 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఇది 64-బిట్ క్వాడ్-కోర్ మొబైల్ ప్రాసెసర్, క్వాల్కామ్ అడ్రెనో 308 జీపీయుతో రానుంది.

ఇందులో బ్లూటూత్ వి4.2, జీపీఎస్, 1080పీ వీడియో రికార్డింగ్, ఎల్ పిడీడీఆర్3 ర్యామ్, ఈఎమ్ఎమ్ సీ 4.5 స్టోరేజీకి మద్దతుతో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ఎక్స్5ఎల్ టిఈ మోడెంతో వస్తుంది. జియోఫోన్ నెక్ట్స్ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను తీసుకురానున్నారు.




