- Telugu News Photo Gallery Technology photos Nokia Launch New SmartPhone In India Nokia C20 Plus Features And Price Details
Nokia C20 Plus: రూ. 10 వేలలోపు అద్భుత ఫీచర్లతో స్మార్ట్ ఫోన్.. భారత మార్కెట్లోకి నోకియా కొత్త ఫోన్ విడుదల.
Nokia C20 Plus: ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ నోకియా తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. నోకియా సి20 ప్లస్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో రూపొందించింది. నోకియా కొత్త ఫోన్‌పై ఫీచర్లు ఓ సారి చూసేయండి..
Updated on: Aug 13, 2021 | 9:05 AM

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నోకియా ఆండ్రాయిడ్ ఫోన్‌ల పోటీకి తట్టుకోలేకపోయింది. విండోస్ ఫోన్లతో మార్కెట్లోకి అడుగుపెట్టినా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

దీంతో ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌లను తయారు చేస్తూ పూర్వ వైభవం తెచ్చుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే తాజాగా నోకియా సి 20 ప్లస్‌తో మరో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది.

ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో నడిచే ఈ స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల హెచ్‌డి+డిస్‌ప్లేతో రూపొందించారు. ఈ ఫోన్ 1.6GHz ఆక్టా-కోర్ యునిసోక్ SC9863a ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ధర విషయానికొస్తే.. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ కేపాసిటీ ఫోన్‌ను రూ. 8,999కి, 3 జీబీ ర్యామ్3 GB RAM + 32 GB స్టోరేజ్ వేరియంట్ రూ .9,999 ధరగా ఉంది. ఇక జియో ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆఫర్‌లో భాగంగా 10 శాతం లేదా రూ. 1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

నోకియా సి20 ప్లస్ ఫోన్‌లో 8 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

బ్యాటరీకి అధిక ప్రధానత్య ఇచ్చిన ఈ ఫోన్‌లో 4,950 mAh బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే రెండు రోజులు వస్తుంది.




