Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmaputra: బ్రహ్మపుత్ర నది కింద నుంచి సొరంగం నిర్మిస్తున్న భారత సైన్యం.. చైనా దూకుడుకు కళ్లెం వేయనున్నారా.?

Brahmaputra River: భారత సైన్యం చారిత్రాత్మక బ్రహ్మపుత్ర నది కింద సొరంగం నిర్మిస్తోందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఈ సొరంగం సహాయంతో భారత్‌ చైనాను..

Brahmaputra: బ్రహ్మపుత్ర నది కింద నుంచి సొరంగం నిర్మిస్తున్న భారత సైన్యం.. చైనా దూకుడుకు కళ్లెం వేయనున్నారా.?
Follow us
Subhash Goud

|

Updated on: Aug 15, 2021 | 5:01 PM

Brahmaputra River: భారత సైన్యం చారిత్రాత్మక బ్రహ్మపుత్ర నది కింద సొరంగం నిర్మిస్తోందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఈ సొరంగం సహాయంతో భారత్‌ చైనాను చుట్టుముడోతందని అన్నారు. నది కింద నిర్మించిన ఈ సొరంగం సరిగ్గా మనాలిలోని అటల్‌ టన్నెల్‌లాగా ఉంటుందన్నారు. అయితే అరుణాచల్‌ ప్రదేశ్‌ చైనా సరిహద్దులో ఉండటంతో వారి దూకుడుకు ఈ సొరంగం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

సొరంగం నిర్మాణం కోసం రూ. 5 వేల కోట్లు

కాగా, సొరంగం బ్రహ్మపుత్ర నదికి దిగువన ఉన్న మిసా నుంచి ప్రారంభమై తేజ్‌పూర్‌ వరకు వెళ్తుందని సీఎం వెల్లడించారు. దీని పొడవు దాదాపు 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు ఉంటుందని, అసోంలోని అంతర్జాతీయ సరిహద్దుకు చేరుకోవడానికి చైనాకు 5 రోడ్లు ఉన్నాయని, అయితే భారతదేశంలో బొమ్దిలా గుండా వెళ్లే ఒక రహదారి మాత్రమే ఉందన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సరిహద్దును రహదారి ద్వారా అనుసంధానించే విధంగా మరిన్ని రోడ్లను నిర్మించాలని సైన్యం భావిస్తోందని చెప్పారు. సొరంగం నిర్మాణం వల్ల సైన్యానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుందన్నారు. ఈ సొరంగం నిర్మాణానికి రూ.4 వేల నుంచి రూ.5వేల కోట్ల మధ్య ఖర్చు అవుతుందని అసోం ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ప్రపంచంలోని అతి పొడవైన నది బ్రహ్మపుత్ర:

బ్రహ్మపుత్ర నదిని టిబెట్‌లో యార్లుంగ్‌ సాంగ్‌పో, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సియాంగ్‌, దిహాంగ్‌ నది, అసోంలోని లూయిట్‌ దిలావ్‌ అని కూడా అంటారు. ఈ నది చైనా, ఇండియా, బంగ్లాదేశ్‌ మధ్య సరిహద్దు లాంటిది. ఈ నది ప్రపంచంలోనే 9వ అతిపెద్ద నది కాగా, ప్రపంచంలో పొడవైన నదుల్లో 15వది ఈ బ్రహ్మపుత్ర నది. ఈ నది దాదాపు 3,969 కిలోమీటర్లు. సగటున లోతు దాదాపు 124 అడుగులు.

ఆయుధాలు సులభంగా సరఫరా..

చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని తైహు సరస్సు కింద నిర్మిస్తున్న సొరంగం కంటే ఈ సొరంగం పొడవుగా ఉంటుందని గత సంవత్సరం వచ్చిన వార్తలు పేర్కొన్నాయి. ఈ సొరంగం భారతదేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ఎందుకంటే దీని సహాయంతో అసోం, అరుణాచల్ ప్రదేశ్ ఏడాది పొడవునా కనెక్ట్ అవుతాయి. ఇక సొరంగం సహాయంతో సైనిక సరఫరా, ఆయుధాల సరఫరా కూడా సహాయపడతాయి. ఈ టన్నెల్ లోపల వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి.

ఇవీ కూడా చదవండి

Fact Check: ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించినందుకు కేంద్రం ప్రజలకు ఉచితంగా ఏడాది పాటు మొబైల్‌ రీఛార్జ్‌.. నిజమెంత?

Jeff Bezos: కొంపముంచిన జెఫ్‌ బెజోస్‌ అంతరిక్షయానం.. గుడ్‌బై చెబుతున్న అమెజాన్ యూజర్లు.. ఎందుకంటే.!

ఇదేం చేస్తుందిలే అని చీప్‌గా చూసేరు.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం..
ఇదేం చేస్తుందిలే అని చీప్‌గా చూసేరు.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం..
ఆరుగురు హీరోయిన్స్ తర్వాత విజయ్ సినిమాలో ఆమె ఫిక్స్ అయ్యిందా..?
ఆరుగురు హీరోయిన్స్ తర్వాత విజయ్ సినిమాలో ఆమె ఫిక్స్ అయ్యిందా..?
మీ మతిమరుపునకు అసలు కారణం తెలిస్తే.. వీడియో
మీ మతిమరుపునకు అసలు కారణం తెలిస్తే.. వీడియో
సంగారెడ్డిలో ఘోరం..ముగ్గురు పిల్లల‌కు విష‌మిచ్చి తానూ తాగిన తల్లి
సంగారెడ్డిలో ఘోరం..ముగ్గురు పిల్లల‌కు విష‌మిచ్చి తానూ తాగిన తల్లి
ఈ పండు తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. వీడియో
ఈ పండు తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. వీడియో
అమెరికా వెళ్లాలనుకునే విద్యార్ధులకు షాక్‌.. ట్రంప్ ఏం చేశారంటే?
అమెరికా వెళ్లాలనుకునే విద్యార్ధులకు షాక్‌.. ట్రంప్ ఏం చేశారంటే?
ముల్లును ముల్లుతోనే తీయాలి.. తూర్పు లద్దాఖ్‌లో అధునాతన బలగాలు
ముల్లును ముల్లుతోనే తీయాలి.. తూర్పు లద్దాఖ్‌లో అధునాతన బలగాలు
పంత్ ఆటపై కోపంతో లైవ్ షోలో టీవీ పగలగొట్టిన యాంకర్
పంత్ ఆటపై కోపంతో లైవ్ షోలో టీవీ పగలగొట్టిన యాంకర్
అమ్మాయి మనసుని అబ్బాయి ఎలా గెలుచుకోవాలో తెలుసా..
అమ్మాయి మనసుని అబ్బాయి ఎలా గెలుచుకోవాలో తెలుసా..
ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 దరఖాస్తులు ప్రారంభం..
ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 దరఖాస్తులు ప్రారంభం..