AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Emojis: ఎమోజీలు పసుపు రంగులో ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.? అసలు కారణం ఇదే..!

Emojis: స్మార్ట్‌ ఫోన్‌లలో ఎన్ని అప్‌డేట్‌లు వస్తున్నా, మెసేజింగ్‌ యాప్‌లు ఎన్ని ఉన్నా.. ఎమోజీలు మాత్రం కామన్‌గా ఉంటాయి. అవతలి వాళ్లు ఎంత పెద్ద మెసేజ్‌ రాసినా.. సింపుల్‌గా ఒక్క..

Emojis: ఎమోజీలు పసుపు రంగులో ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.? అసలు కారణం ఇదే..!
Emojis
Subhash Goud
|

Updated on: Aug 14, 2021 | 7:35 PM

Share

Emojis: స్మార్ట్‌ ఫోన్‌లలో ఎన్ని అప్‌డేట్‌లు వస్తున్నా, మెసేజింగ్‌ యాప్‌లు ఎన్ని ఉన్నా.. ఎమోజీలు మాత్రం కామన్‌గా ఉంటాయి. అవతలి వాళ్లు ఎంత పెద్ద మెసేజ్‌ రాసినా.. సింపుల్‌గా ఒక్క సింబల్‌తో వ్యవహారాన్ని తేల్చేయడంలోనే ఎమోజీల సత్తా ఏంటో తెలుస్తుంది. ఇక మంచం మీద నుంచి లేవడం దగ్గరి నుంచి రాత్రి పడుకునేదాకా, కాలకృత్యాల నుంచి ప్రతీ పనికి ఏదో సింబల్‌తో ఎమోజీలు కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఫోన్‌లో కాల్ చేయడంతో పాటు చాట్ చేయడం కూడా ట్రెండ్‌ అయిపోయింది. ఈ చాటింగ్‌లో పదాలతో పాటు మీ వ్యక్తీకరణలను జోడించడానికి ఎమోజీలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎమోజీ ద్వారా మీరు చాటింగ్ ద్వారా మీ భావాలను కూడా వ్యక్తపరచవచ్చు. అలాగే మీరు సంతోషంగా ఉన్నారా లేదా మీ మనసులో ఏముందో అనే దానిని ఈ ఒక్క ఎమోజీతో చెప్పవచ్చు. చాటింగ్ సమయంలో మీరు కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ ఈ ఎమోజీల రంగు పసుపు ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ ఎమోజీలు స్మైలీ బొమ్మలు లేదా ఇతర ఎమోజీలు అన్ని కూడా రంగు కూడా పసుపే. ఈ స్మైలీ రంగు ఎందుకు పసుపు రంగులో ఉందో, దాని వెనుక ఉన్న కథ ఏమిటో చూద్దాం.

ఎమోజీ ట్రెండ్ ఎలా మొదలైందిలా

ఎమోజీ 1963 సంవత్సరం నుంచి అందుబాటులో ఉన్నట్లు కథనాలు ఉన్నాయి. మొదట ఒక కంపెనీ ఉద్యోగుల మనోబలాన్ని పెంచడానికి ఉపయోగించబడిందని చెబుతుంటారు. ఒకప్పుడు స్టేట్ మ్యూచువల్ లైఫ్ అస్యూరెన్స్ కంపెనీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కంపెనీ ఉద్యోగుల్లో ధైర్యాన్ని పెంచడానికి ఒక గ్రాఫిక్ డిజైనర్‌ని నియమించింది. అతను ఒక చిహ్నాన్ని రూపొందించాడు. ఈ ఈ చిహ్నం పసుపు రంగులో తయారు చేశాడు. దానిపై స్మైలీ ముఖంలా తయారు రూపొందించారు. ఇది ఈ స్మైలీ ఎమోజీ ఉద్యోగులపై మంచి ప్రభావాన్ని చూపింది. అంటే, ఎమోజీని మొదట సృష్టించినప్పుడు అది పసుపు రంగులో మాత్రమే ఉంది. అంటే ఎమోజీ పసుపు రంగుతో ప్రారంభమైందని చెప్పవచ్చు. వాస్తవానికి, అంతకుముందు దీనిని హ్యాపీ ఫేస్ కోసం ఉపయోగించారట. కానీ ఇప్పుడు అనేక రకాల ఎమోజీలు తయారు చేయబడ్డాయి. ఇంతకు ముందు ఎమోజీ ఆనందం వ్యక్తం చేయడానికి ఉపయోగించారు. అది కూడా ఒక వ్యక్తి ముఖ కవళిక రూపంలో తయారు చేశారు.

ఎందుకు పసుపు మాత్రమే?

ఎమోజీలు పసుపు రంగులో ఉండడానికి వివిధ రకాల కారణాలున్నాయి. పసుపు రంగు ఆనందంతో ముడిపడి ఉంటుంది. అలాగే సూర్యుడితో కలిసినప్పుడు అది ఆనందానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో పసుపు రంగు దానితో ముడిపడి ఉందని గుర్తించి పసుపు రంగులోనే ఉంచారు. అలాగే శ్రద్ద, సానుకూల అనుభూతిని వ్యక్తి చేసేలా ఉంటుంది. అందుకే ఎమోజీలు పసుపు రంగులో తయారు చేశారు.

ఇవీ కూడా చదవండి

Banking Customers: మీకు ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయా..? వాటిని క్లిక్‌ చేయకండి.. కొత్త రకం ఫిషింగ్‌ దాడి

LIC: కస్టమర్లు అలర్ట్‌.. మీరు ఎల్‌ఐసీ పాలసీని తీసుకున్నారా.? అయితే ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి..!

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర