Banking Customers: మీకు ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయా..? వాటిని క్లిక్‌ చేయకండి.. కొత్త రకం ఫిషింగ్‌ దాడి

Banking Customers: మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ వివరాలను అడుగుతూ లేదా కేవైసీ పేరుతో మీకు మెసేజ్‌లు వచ్చాయా..? ఇలాంటి మెసేజ్‌లు వచ్చినట్లయితే జాగ్రత్తగా..

Banking Customers: మీకు ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయా..? వాటిని క్లిక్‌ చేయకండి.. కొత్త రకం ఫిషింగ్‌ దాడి
Phishing attack
Follow us
Subhash Goud

|

Updated on: Aug 11, 2021 | 8:44 PM

Banking Customers: మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ వివరాలను అడుగుతూ లేదా కేవైసీ పేరుతో మీకు మెసేజ్‌లు వచ్చాయా..? ఇలాంటి మెసేజ్‌లు వచ్చినట్లయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ. మీ బ్యాంక్ నుంచి వచ్చినట్లే మాయగాళ్లు మిమ్మల్ని మభ్యపెడతారు. కానీ, మీరు మాత్రం అలాంటి మెసేజ్‌లను ఏ మాత్రం నమ్మకండి అని సూచిస్తోంది. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ఆధారాలు, మొబైల్‌ నెంబర్లు, వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (OTP) వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించడానికి స్కామర్‌లు ప్లాట్‌ఫామ్‌లో ఫిషింగ్‌ వెబ్‌సైట్‌లను హోస్టు చేస్తున్నారని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ వెల్లడించింది.

అయితే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు ఇతర బ్యాంకులు కూడా తన కస్టమర్లను వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారం కోరుతూ ఎలాంటి మెసేజ్(SMS)లు పంపించదు. ఇలాంటివన్ని ఫిషింగ్ మెసేజ్‌లు అని పిలుస్తుంటారు. ఇలాంటి మెసేజ్‌ల విషయంలో మీరు జాగ్రత్తగా లేకపోతే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులన్నీ జీరో అయ్యే అవకాశం ఉందని సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరిస్తోంది. అందుకే మెసేజ్‌లు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ మేరకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తోంది. ట్విటర్‌ ద్వారా కస్టమర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేస్తూ.. తమ వినియోగదారులు మోసపోకుండా అవగాహన కల్పిస్తోంది. ఈ మేరకు ‘ వ్యక్తిగత సమాచారం లేదా బ్యాంకింగ్ తదితర వివరాల కోసం ఈమెయిల్స్/మెసేజ్(SMS)/ఫోన్ కాల్స్ ద్వారా కస్టమర్లను సంప్రదించం. మీ సమాచారం కోరుతూ వచ్చిన ఎలాంటి మెసేజ్‌లను నమ్మకండి. ఏదైనా సమచారం కావాలంటే దగ్గరలోని బ్యాంకును సంప్రందించండి. మీ వ్యక్తిగత వివరాలు పంపమని ఎస్‌బీఐ అస్సలు కోరదు. ఇలాంటి SMiShing మెసేజ్‌లపై Report.phishing@sbi.co.in లేదా సైబర్ క్రైమ్‌ హెల్ప్‌లైన్ నంబర్ 155260 కి కాల్ చేయాలి” అంటూ ట్విటర్‌లో పేర్కొంది.

వినియోగదారులు ఇలాంటి అనుమానాస్పద మెసేజ్‌లు ఏవైనా వస్తే వెంటనే తొలగించాలని ఎస్‌బీఐ కోరింది. మీ కార్డు నంబర్/ సీవీవీ (CVV)/ పిన్ (PIN) నంబర్, ఇతర వ్యక్తిగత వివరాలను ఎవరితో పంచుకోకూడదని వినియోగదారులను సైబర్‌ సెక్యూరిటీ టీమ్‌ హెచ్చరించింది.

వినియోగదారుల వ్యక్తిగత డేటా, ఖాతా వివరాలను దొంగిలించడానికి ఫిషింగ్ దాడులు జరుగుతున్నాయని, వాటిపై జాగ్రత్తగా ఉండాలంటూ కస్టమర్లను హెచ్చరించింది. షిఫింగ్‌ దాడులను ఎలా తెలుసుకోవాలంటే..

➦ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారుడు మోసపూరిత ఈ-మెయిల్‌ను అందుకోవడం గమనించాలి.

➦ మెయిల్‌లో సూచించిన హైపర్‌లింక్‌పై క్లిక్ చేయలంటూ మోసగాళ్లు సూచిస్తారు. అలాంటి వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది.

➦ యూజర్ హైపర్‌లింక్‌ని క్లిక్ చేయగానే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సైట్‌ లాగే ఉండే నకిలీ వెబ్‌సైట్‌కి ఆ లింక్ తీసుకెళ్తుంది.

➦ సాధారణంగా, ఈమెయిల్‌ను క్లిక్ చేస్తే బహుమతులు లభిస్తాయంటూ మభ్యపెడుతుంది. లేదంటే పెనాల్టీ పడుతుందంటూ భయపెడతారు. అలాంటి వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది.

➦ లాగిన్/ప్రొఫైల్ లేదా లావాదేవీ పాస్‌వర్డ్‌లతో పాటు బ్యాంక్ ఖాతా నెంబర్ల లాంటి వ్యక్తిగత అకౌంట్ వివరాలను అందించాలంటూ వినియోగదారులను కోరుతుంటారు. అలాంటి మెసేజ్‌లకు ఏ మాత్రం స్పందించరావు.

➦ వినియోగదారులకు అవగాహన లేకపోవడం వల్ల వ్యక్తిగత అకౌంట్ వివరాలను అందించి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేస్తారు. తర్వాత మీకు ఎర్రర్ పేజీ దర్శనమిస్తుంది. ఇలా ఎర్రర్‌ వచ్చినా.. మీ వ్యక్తిగత వివరాలు సైబర్‌ నేరగాళ్లకు తెలిసిపోతుంది. దీంతో మీరు మోసపోవడం ఖాయం. దీంతో వినియోగదారుడు ఫిషింగ్‌ దాడికి గురైనట్లు అర్థం.

ఇలాంటి ఫిషింగ్ దాడుల గురించి ఎస్‌బీఐ కస్టమర్‌లు కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే నిలువునా మోసపోవాల్సి వస్తుంది. ఎలాంటి అనుమానం వచ్చినా.. దగ్గరలోనే మీ సంబంధిత బ్రాంచ్‌కు వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. అంతేకాని, వ్యక్తిగత అకౌంట్ వివరాలను ఇతరులకు చెప్పకూడదు.

ఇవీ కూడా చదవండి

WhatsApp Drawing Tools: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..ఇక నుంచి వాట్స‌ప్ వెబ్‌లోనూ ఫోటో ఎడిట్‌ ఆప్షన్‌..!

TikTok: షార్ట్‌ వీడియో యాప్‌ ‘టిక్‌టాక్‌’ మరో రికార్డు నమోదు.. అత్యధికంగా డౌన్‌లోడ్‌ యాప్‌గా.. వెనుకబడ్డ ఫేస్‌బుక్‌..!